కుంభరాశిలో సూర్యుడు: ఆరు రాశులవారికి ఆరోగ్య నష్టం.. జాగ్రత్త!!
కుంభరాశిలో సూర్య సంచారం కారణంగా కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను పొందితే మరికొన్ని రాశుల వారు ప్రతికూల ఫలితాలను పొందుతారు. సూర్య సంచారం వల్ల ముఖ్యంగా 6 రాశుల వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. ఆ రాశుల వివరాలు తెలుసుకుందాం.
కుంభరాశిలో సూర్య సంచారం వల్ల సింహరాశి వారు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. కాళ్ల నొప్పులు వీళ్లను వేధించవచ్చు. ఈ సమయంలో వీరిలో రోగనిరోధక శక్తి తగ్గుతుంది. కనుక సింహ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశిలో సూర్య సంచారం వల్ల తులారాశి వారు కాళ్ల నొప్పులను ఎదుర్కోవచ్చు. తులారాశి వారి తల్లి ఆరోగ్యం క్షీణిస్తుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. కుటుంబ ఆరోగ్యాన్ని, కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోవలసిన ఉంది.

కుంభరాశిలో సూర్య సంచారం వల్ల కుంభరాశి జాతకులు వివిధ రకాల సమస్యలతో బాధపడతారు. ఈ సమయంలో వీరికి అనారోగ్యమే పెద్ద ఆందోళనగా మారుతుంది. ఆరోగ్యం కోసం ఎక్కువ ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. కుంభ రాశి వారి జీవిత భాగస్వామి ఆరోగ్యం కోసం కూడా ఈ సమయంలో ఖర్చు చేయాల్సిన అవసరం వస్తుంది.
కుంభరాశిలో సూర్య సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి అనారోగ్య సమస్యలు వస్తాయి. వీరు కాళ్లు, తొడలు నొప్పికి సంబంధించిన ఇబ్బందిని ఎదుర్కొంటారు. వీరి రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. కుంభరాశిలో సూర్య సంచారం వల్ల మకర రాశి జాతకులు కాళ్లు, పాదాల నొప్పులను ఎదుర్కొంటారు. వీరి రోగనిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా అనేక అనారోగ్య సమస్యలకు మకరరాశి వారు గురవుతారు.
మీన రాశి వారికి కూడా కుంభరాశిలో సూర్య సంచారం అనుకూలంగా ఉండదు. వీరిలో రోగ నిరోధక శక్తి గణనీయంగా తగ్గుతుంది. దాని కారణంగా వీరు అనారోగ్యానికి గురవుతారు. వీరిని కాళ్లు మరియు తొడల నొప్పి బాధిస్తుంది. సూర్య సంచార సమయంలో ఆరోగ్య సమస్యలు కలిగించే ఒత్తిడితో మీన రాశి వారు ఇబ్బంది పడతారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications