డిసెంబర్ 3నుండి వీరికి సంపదల ప్రకాశం వరమిచ్చిన సూర్య భగవానుడు
భారతీయ జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలకు అధిపతిగా సూర్యుడిని పరిగణిస్తారు. ఆత్మ,శక్తి, ఆత్మవిశ్వాసానికి ప్రతీకగా సూర్యుడిని చూస్తారు. అటువంటి సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేయడం ద్వాదశ రాశుల వారి జీవితాలలో ప్రభావవంతమైన ఫలితాలకు కారణమవుతుంది. సూర్యుడు డిసెంబర్ 3వ తేదీన అనురాధ నక్షత్రం నుంచి బుధుడి నక్షత్రమైన జ్యేష్టా నక్షత్రం లోకి ప్రవేశిస్తాడు.
సూర్య సంచారంతో లబ్ధిని పొందే రాశులు
జేష్ఠ నక్షత్రంలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి విశేషమైన ఫలితాలను ఇస్తుంది. సూర్యుడి నక్షత్ర సంచారంతో వారికి సానుకూల ప్రయోజనాలు చేకూరుతాయి. ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది . సూర్య సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

కర్కాటక రాశి
సూర్యుని నక్షత్రం మార్పు కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు ఈ సమయంలో కార్యాలయంలోని ప్రత్యర్థుల పైన గెలుస్తారు. మీ జ్ఞానం మీ చాతుర్యం విజయానికి కారణమవుతుంది. వ్యాపారం చేసే వారు వ్యాపార నిర్ణయాల విషయంలో సానుకూలతలను చూస్తారు. పెళ్ళికాని వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వివాహితులు అద్భుతమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తారు. పురోగతికి నూతన మార్గాలు తెరుచుకుంటాయి. మీ బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది.
మేషరాశి
సూర్యుని నక్షత్ర మార్పు మేష రాశి జాతకులకు చాలా సానుకూల ప్రయోజనాలను ఇస్తుంది. ఇది మీ పనిలోనూ, వ్యాపారంలోని గణనీయమైన పురోగతిని తీసుకువస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. వ్యాపారవేత్తలకు గణనీయమైన ఆర్థిక లాభాలు కలుగుతాయి సూర్యుని రాశి మార్పు ఉద్యోగ పురోగతికి పదోన్నతికి దారితీస్తుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. సమాజంలో గౌరవం మర్యాద పెరుగుతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుని నక్షత్రం మార్పు అద్భుతమైన ప్రయోజనాలను ఇస్తుంది. సింహ రాశి వారి రోజువారి ఆదాయం పెరుగుతుంది కొత్త ప్రాజెక్టుల పైన పనిచేస్తారు. కొత్త వ్యాపార ప్రణాళికలు చేస్తారు ఇది భవిష్యత్తులో సింహ రాశి వారికి గణనీయమైన లాభాలను తెస్తుంది. ఈ సమయంలో వాహనాలను , ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. పిల్లలకు సంబంధించి శుభవార్తలు వింటారు. సింహ రాశి వారు దేశ, విదేశాలకు ప్రయాణించే అవకాశం ఉంటుంది.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications