త్వరలో మీనరాశిలోకి సూర్యగోచారం.. ఈ రాశులవారు పట్టిందల్లా బంగారం!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు వ్యక్తుల జీవితాలపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతాయి. గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం సంచారం చేస్తూ అన్ని రాశులవారి జీవితాలపై ప్రభావం చూపుతాయి. ముఖ్యంగా శక్తికి, ఆత్మ విశ్వాసానికి ప్రతీక అయిన సూర్యుడు ప్రతీ నెల రోజులకు ఒక రాశిలోకి సంచారం చేస్తాడు.
మార్చి 15న మీనరాశిలోకి సూర్యుడు
ప్రస్తుతం కుంభరాశిలో ఉన్న సూర్యుడు త్వరలో, మార్చి 15న మీన రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం నాలుగు రాశుల వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలను తెచ్చి పెడుతుంది. వీరి బ్యాంకు బ్యాలెన్స్ గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. మరి ఆ రాశులు ఏమిటో ఒకసారి చూద్దాం.

మిథున రాశి
సూర్యుడి మీన రాశి సంచారం మిథున రాశి జాతకులకు సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరి ఆదాయం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగి, ఆనందం లభిస్తుంది. సూర్య గోచారం కారణంగా ఆకస్మిక ధన లాభం వస్తుంది. ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది.
కర్కాటక రాశి
సూర్య సంచారం కర్కాటక రాశి వారికి విశేష ప్రయోజనాలను అందిస్తుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి కోరికలు తీరుతాయి. విదేశీ ప్రయాణ ఆకాంక్షలు నెరవేరతాయి. విద్యార్థులు ఉన్నత ర్యాంకులు సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగి, ప్రతి పనిలో విజయం వీరి సొంతమవుతుంది.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఇది మంచి సమయం. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. లాభదాయక ఆకస్మిక ప్రయాణాలుంటాయి. మొండి బాకీలు వసూలవుతాయి, కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. ఇంటా బయట సానుకూల వాతావరణం నెలకొంటుంది. ఇది వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది.
మీన రాశి
మీన రాశి వారికి అద్భుతమైన సమయంగా దీనిని చెప్పవచ్చు. సూర్యుడి సంచారం మీనరాశి జాతకుల మానసిక ప్రశాంతతను పెంచుతుంది. అనారోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఇంటా బయటా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఈ సమయంలో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాను ఇస్తాయి. ఇది మీనరాశి వారికి సత్ఫలితాలను ఇస్తుంది.
గమనిక: ఈ సమాచారం జ్యోతిష్య నిపుణులు, ఇంటర్నెట్‌లో లభించిన ఆధారంగా రూపొందించబడింది. దీనిని Oneindia ధ్రువీకరించలేదు.
-
వాస్తు ప్రకారం ఇంటికి 2 ప్రధాన ద్వారాలు ఉండొచ్చా? -
శుక్ర సంచారంతో ఏప్రిల్ లో ఈ రాశులవారికి గడ్డుకాలం.. జాగ్రత్త! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
జన్మ నక్షత్రం హస్త, చిత్త, స్వాతి ఉన్నవారికి ఏప్రిల్ నెల జాతక ఫలం -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్












Click it and Unblock the Notifications