విజయదశమి తర్వాత ఈ రాశులవారికి ధనపు సంచులను తెస్తున్న సూర్యుడు!
హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ద్వాదశ రాశుల వారి జీవితాన్ని నిర్ధారిస్తుంది. గ్రహాల రారాజు అయిన సూర్యుడికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. మరో 7రోజుల్లో సూర్యుడు అక్టోబర్ 17వ తేదీన తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. తులా రాశిలో సూర్య సంచారం కారణంగా ఐదు రాశుల వారి జీవితం మారిపోతుంది. ఐదు రాశుల వారికి ఊహించని సంపదతో పాటు అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మేష రాశి
అక్టోబర్ 17 నుండి గ్రహాల రారాజుగా భావించే సూర్యుడు తులా రాశిలో ప్రవేశించడం వల్ల మేష రాశి వారి జాతకం మారిపోతుంది. ఈ సమయంలో వీరు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపారులు లాభాలను ఆర్జిస్తారు.ఆకస్మిక ధన లాభం కలగడంతో ఆర్థికంగా పటిష్టంగా ఉంటారు. మేష రాశి వారికి ఇది అదృష్ట సమయం.

వృషభ రాశి
సూర్య సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. అక్టోబర్ 17 నుంచి ఈ రాశి వారికి ఆదాయం పెరుగుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు గణనీయమైన ఆర్థిక లాభాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. విద్యార్థులకు ఇది అనువైన సమయం.
కన్యారాశి
కన్యారాశి జాతకులకు ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. కెరీర్ కి సంబంధించిన శుభవార్తలు వింటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి. ఉద్యోగాలు చేసే వారికి పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం. ఆర్థికంగా ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావు.. ఈ సమయంలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి.
కుంభరాశి
కుంభ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంటుంది. జీవితంలో సానుకూల పరిణామాలు ఎదురవుతాయి. వ్యాపారులు లాభాలను పొందుతారు. చాలా కాలంగా ఉన్న సమస్యలు తొలగిపోయి ఆర్థికంగా లాభపడతారు. జీవితంలో సానుకూలమైన పరిణామాలతో కుంభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది.
తులారాశి
తులా రాశి వారికి సూర్యసంచారం కారణంగా ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన సమయం. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఇంట్లో పెద్ద వారి ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులకు ఈ సమయంలో సానుకూలంగా ఉంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications