Sun transit: సూర్య సంచారంతో మరో మూడురోజుల్లో ఈ రాశులకు లక్ష్మీకటాక్షం!!
సూర్యుడు మీనరాశిని వీడి మేషరాశి లోకి మరో మూడు రోజుల్లో ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి మంచి రోజులు మొదలు కాబోతున్నాయి. సూర్యుడు మేషరాశిలోకి వెళ్లడం వల్ల ఏ రాశి చక్రాల వారికి అదృష్టం కలిసి వస్తుందో, ఏ రాశులవారికి లక్ష్మీ కటాక్షం ఉందో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
సూర్య సంచారంతో ఈ రాశులకు అదృష్టం
గ్రహాలలో ముఖ్యమైన తొలి గ్రహంగా చెప్పే సూర్యుడు నెలకోసారి రాశిచక్రాన్ని మారుస్తూ ఉంటాడు. నవగ్రహాలలో సూర్యుడిని అన్ని గ్రహాలకు రారాజుగా చెబుతారు. అటువంటి సూర్యుడు అనుకూల స్థానంలో ఉన్నప్పుడు వ్యక్తి అదృష్టం గణనీయంగా పెరుగుతుంది ఏప్రిల్ 13వ తేదీన సూర్యుడు మీనరాశి నుండి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని ఫలితంగా అదృష్టం ప్రకాశించే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

మేషరాశి
సూర్యుడు మీనరాశిని విడిచి మేషరాశి లోకి ప్రవేశించడం మేష రాశి వారికి మేలు చేకూరుస్తుంది. మేషరాశి వారి సంపద అభివృద్ధి జరుగుతుంది. మేషరాశి జాతకులు ఆర్థిక శ్రేయస్సును పొందుతారు. వారి ఇళ్లల్లో శుభకార్యాలు జరుగుతాయి. కుటుంబ జీవనం చాలా సంతోషంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా బాగా లబ్ధిని పొందుతారు. ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. జీవిత భాగస్వామితోనూ మంచి సంబంధాలను కొనసాగిస్తారు.
మిధున రాశి
సూర్య సంచారం వల్ల మిధున రాశి జాతకులకు అన్ని విధాలా ప్రయోజనం చేకూరుతుంది. మిధున రాశి జాతకుల కుటుంబం సంతోషంతో ఉంటుంది. ఆర్థిక పురోగతి కలుగుతుంది. ఈ సమయంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఎప్పటినుంచో రాకుండా పెండింగ్లో ఉన్న డబ్బు చేతికి అందుతుంది. కొత్త పనులు ప్రారంభించడం చాలా శుభంగా ఉంటుంది .వైవాహిక జీవితం కూడా బాగానే ఉంటుంది.
సింహ రాశి
సింహరాశి జాతకులకు ఈ సమయంలో అదృష్టం ప్రకాశిస్తుంది. వీరి ఆర్ధిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఉద్యోగ పరంగాను సింహ రాశి వారికి అనుకూలమైన సమయం ఈ సమయంలో మీరు చేసే లావాదేవీలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. అన్ని విధాలా ఈ సమయం లాభదాయకం,
కన్య రాశి
సూర్యుడి సంచారం వల్ల కన్యా రాశి వాళ్ళకి అన్ని శుభాలే కలుగుతాయి. ఈ సమయంలో కన్యారాశి జాతకుల ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు శుభవార్తలు వింటారు. పదోన్నతులు కలిగే అవకాశం ఉంది. అయితే కచ్చితంగా ఖర్చులు నియంత్రించుకుని ఆర్థికంగా ముందుకు సాగాల్సి ఉంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications