ఆగస్ట్ లో మూడుసార్లు సంచరించి మూడింతల ధనలాభాలు కలిగించే సూర్యుడు
ఆగస్టు మాసంలో గ్రహాలు కదలికలు చాలా కీలకంగా మారుతున్నాయి ఆగస్టు మాసంలో ముఖ్య గ్రహాలు కదలికల వలన ద్వాదశ రాశుల వారి జీవితాలలో మార్పులు రానున్నాయి. ముఖ్యంగా గ్రహాలకు రాజుగా భావించే సూర్యుడు ఆగస్టు మాసంలో మూడుసార్లు తన రాసిని మార్చుకోబోతున్నాడు. ముఖ్యంగా సూర్యుడు ప్రతినెలా ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతూ ఉంటాడు కానీ ఆగస్టు నెలలో మూడుసార్లు సూర్యుడు మారుతూ ఉండడం విశేషం.
సూర్య సంచారం
సూర్యుడు మూడుసార్లు నక్షత్రాలలోకి, రాశిలోకి మారడం వల్ల కొన్ని రాశుల వారు సానుకూల ఫలితాలను పొందుతున్నారు. ఆగస్టు 3న ఆశ్లేష నక్షత్రంలో సూర్యుడు సంచరిస్తాడు, మళ్ళీ ఆగస్టు 17న, ఆగస్టు 30న పూర్వ ఫల్గుణి నక్షత్రంలో సంచరిస్తాడు. సూర్య సంచారముతో ఈ రాశుల వారు సంపదను పొందుతారు.ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఆగస్టు మాసంలో సూర్య సంచారం సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృషభ రాశి వారి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో స్థిరత్వం లభిస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది.
సింహరాశి
సింహరాశి వారికి సూర్య సంచారం అదృష్టాన్ని ఇస్తుంది. సూర్యుడు ఆగస్టు మాసంలో మూడు సార్లు రెండు నక్షత్రాల లోకి ఒక రాశిలోకి మారడం వల్ల సింహరాశి జాతకులకు దీర్ఘకాలిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. సింహ రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఆరోగ్యం మెరుగుపడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి
తులారాశి
ఆగస్టు నెలలో సూర్య సంచారం తులా రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. తులా రాశి వారి బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. పెట్టుబడులు పెట్టే వారికి ఇది లాభదాయకమైన సమయం. ఈ సమయంలో నూతన ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ప్రేమ జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి
సూర్య సంచారం వృశ్చిక రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ఎప్పటినుంచో పరిష్కారం కాని సమస్యల నుంచి ఇప్పుడు బయటపడతారు. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది లాభాలు వచ్చే సమయం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications