Surya gochar 2024: కర్కాటకరాశిలోకి సూర్యుడు.. జులై 16నుండి నెలరోజులు అదృష్టమంటే వీరిదే
సూర్యుడు ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచరించడానికి నెల రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం వృషభరాశిలో ఉన్న సూర్యుడు జూలై నెలలో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు రాశి మార్పు ఆయా రాశులలో సంక్రాంతిని తీసుకువస్తుంది. జులై 16వ తేదీన సూర్యుడు కర్కాటకరాశిలోకి ప్రవేశించనున్న కారణంగా ఆరోజు కర్కాటక సంక్రాంతి వచ్చింది.
కర్కాటక రాశిలోకి సూర్య సంచారం
జూలై 16వ తేదీన ఉదయం 11 గంటల 29 నిమిషాలకు కర్కాటక రాశిలోకి సూర్యసంచారం జరుగుతుంది. సూర్యుడు కర్కాటక రాశిలో నెలపాటు ఉండి ఆ తరువాత సింహరాశి లోకి వెళతాడు. సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడం వల్ల నెలరోజుల పాటు కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మిధున రాశి
సూర్యుడు కర్కాటక రాశి సంచారం కారణంగా మిధున రాశి వారికి కలిసొస్తుంది. మిధున రాశి వారు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు బాగా సంపాదిస్తారు. ఏ రంగంలో పనిచేసినా కూడా విజయాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు అవార్డులు, రివార్డులు పొందుతారు. ఆర్థికపరమైన విషయాలలో అనేక శుభవార్తలను వింటారు. ఈ సమయం అన్ని శుభ ఫలితాలను ఇస్తుంది. నెల రోజుల పాటు ఈ రాశి వారిని అదృష్టం వరిస్తుంది.
తులారాశి
సూర్యుడు కర్కాటక రాశిలో సంచరించడం వల్ల తులా రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో కొత్త కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థిక పరంగాను ఈ సమయం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో దానధర్మాలపైన ఆధ్యాత్మికతపైన మొగ్గు చూపుతారు. సామాజిక రంగంలో పనిచేసే వారు దాని గురించి సానుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు కూడా బాగా పెరుగుతాయి.
మీన రాశి
కర్కాటక రాశిలో సూర్య సంచారం కారణంగా మీన రాశి వారికి లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో మీ సమస్యల పరిష్కారం ఈజీగా అవుతుంది. మీరు క్రియేటివ్ గా పని చేయడానికి ఆలోచిస్తారు. ఆర్థిక విషయాలలోనూ లాభదాయకంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో పిల్లలతో మీరు గడపడం వల్ల ఆనందాన్ని పొందుతారు. పనిలో మీ నిబద్ధతను, ప్రతిభను ఉన్నతాధికారులు గుర్తిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications