త్వరలో వీరికి రాజభోగాలను, సంపన్నయోగాన్ని ప్రకటించిన గ్రహాల రారాజు!!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు అధిపతి అయిన సూర్యుడికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని గ్రహాల రాజుగా చెబుతారు. అటువంటి గ్రహాల రాజు చేసే సంచారం కూడా అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. అక్టోబర్ మాసంలో సూర్యుడు 23వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు.

వృశ్చిక రాశిలో సూర్య సంచారం
నవంబర్ 21 వరకు సూర్యుడు వృశ్చిక రాశిలోనే సంచరిస్తాడు. ఇక సూర్యుడు వృశ్చిక రాశి సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కొన్ని రాశులవారు ఊహించని ఆకస్మిక ధనలాభాలను ఈ సమయంలో పొందుతారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

Surya gochar 2024 Sun transit in Scorpio Wealth and royal life for these zodiac signs

వృశ్చిక రాశి
వృశ్చికరాశిలో సూర్యసంచారం వృశ్చిక రాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండి అన్ని పనులలోను విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా లాభాలను చేకూరుస్తుంది. వివాహమైన వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా జీవిస్తారు. అవివాహితులకు పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఈ సమయంలో చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు.

సింహరాశి
వృశ్చిక రాశిలో సూర్యసంచారం సింహరాశి జాతకులకు అదృష్టాన్ని తెస్తుంది. ఈ సమయంలో సింహరాశి జాతకులు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. తల్లిదండ్రులతో మంచి సంబంధాలను కలిగి ఉంటారు. గతంలో పెట్టిన వ్యాపార పెట్టుబడులు ఇప్పుడు లాభాలను ఇస్తాయి. ఊహించని ఆకస్మిక ధన లాభాలను పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది. భౌతిక ఆనందాలను పొందుతారు. పని చేసే చోట శుభవార్తలను వింటారు.

కుంభరాశి
వృశ్చిక రాశిలో సూర్యసంచారం కారణంగా కుంభరాశి జాతకులు ఆర్థికంగా ప్రయోజనాలను పొందుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కెరీర్ లో ఊహించని పురోగతి కనిపిస్తుంది. వర్తక, వ్యాపారాలు చేసేవారు కూడా ఆర్థికంగా పురోగమిస్తారు. ఈ సమయం మీ ఆదాయాలను గణనీయంగా పెంచే సమయం.సమాజంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+