త్వరలో వీరికి ఆర్ధిక నష్టాలను, కష్టాలను ఇస్తున్న శుక్ర దహనం!

2025 మార్చి 18వ తేదీన 7.34 నిమిషాలకు మీనరాశిలో శుక్రుడు దహనం అవుతాడు. మీనరాశిలో శుక్ర దహనం అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. శుక్రుడు ప్రేమ మరియు లగ్జరీలకు అధిపతిగా చెప్పే గ్రహం. అటువంటి శుక్రుడు దహనం అవుతున్నప్పుడు సూర్యుడికి దగ్గరగా ఉంటాడని, సూర్యుడికి ఎనిమిది డిగ్రీల లోపల ఉంటాడని చెబుతారు.

ఏ గ్రహమైనా సరే సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు దహనం జరుగుతుంది. దీనివల్ల గ్రహం యొక్క శక్తి బలహీనపడుతుంది. శుక్ర దహనం కూడా సూర్యుడికి దగ్గరగా ఉండటం వల్లనే జరిగింది. ఈ కారణంగా కొన్ని రాశులవారు సవాళ్లను ఎదుర్కొంటారు. ప్రతికూలతలను, కష్టాలను ఎదుర్కొనే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

The burning of Venus which will soon bring financial losses and hardships to them

మేషరాశి
జాతకంలో రెండవ మరియు ఏడవ ఇళ్లకు అధిపతి అయిన శుక్రుడు మేష రాశి వారి 12వ ఇంట్లోకి వెళ్లి దహనం అవుతాడు. దీనివల్ల మేష రాశి వారు విపరీతమైన ఖర్చులు చేస్తారు. లగ్జరీలతో సంతోషంగా గడిపినప్పటికీ భవిష్యత్తుకు సంబంధించిన ప్రణాళిక లేకుండా మేష రాశి జాతకులు ఈ సమయంలో ఉంటారు.

మిధున రాశి
శుక్రుడు మిధున రాశి ఐదవ మరియు 12వ ఇళ్లకు అధిపతి. శుక్రుడు మిధున రాశిలో పదవ ఇంటికి వెళతాడు. పదవి ఇంట్లో శుక్ర దహనం కారణంగా మిధున రాశి జాతకులకు ఏమాత్రం ప్రయోజనాలను కలిగించదు. శుక్ర దహనం మిధున రాశి వారు ఏ పని చేసినా ప్రతికూలతలకు కారణమవుతుంది. ప్రేమ సంబంధాలలో జాగ్రత్తగా ఉండకపోతే ఈ సమయంలో అనవసరమైన బాధను పడవలసి వస్తుంది.

కన్యారాశి
కన్యా రాశిలో శుక్రుడు రెండవ ఇంటికి మరియు తొమ్మిదవ ఇంటికి అధిపతిగా ఉంటాడు. ఇక ఏడవ ఇంట్లో దహనం అవుతాడు. ఏడవ ఇంట్లో శుక్ర దహనం వైవాహిక మరియు వ్యక్తిగత సంబంధాలలో సమస్యలను కలిగిస్తుంది. లైంగిక అవయవ సంబంధిత అనారోగ్యాలను చూస్తారు. ప్రయాణాలకు దూరంగా ఉంటే మంచిది. మహిళలతో విభేదాలను నివారించాలి. కన్యా రాశి వారు తమ పని పట్ల నిబద్ధతతో వ్యవహరించాలి.

తులారాశి
తులా రాశిలో లగ్న గృహాన్ని, ఎనిమిదవ ఇంటిని శుక్రుడు పాలిస్తాడు. ఆరవ ఇంట్లో శుక్రుడు దహనం జరుగుతుంది. ఇది తులా రాశి జాతకులకు అశుభాన్ని చూపుతుంది. జీవితంలోని వివిధ రంగాలలో ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శుక్ర సంచారం వివాహితుల పైన కూడా ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. ఆరోగ్య సమస్యలు వస్తాయి. స్త్రీలతో వాదనలకు దూరంగా ఉండాలి.

మీన రాశి
మీన రాశిలో మూడవ మరియు ఎనిమిదవ ఇళ్లకు శుక్రుడు అధిపతి. ఈ సంచార సమయంలో శుక్రుడు మొదటి ఇంట్లో దహన స్థితిలో ఉంటాడు. మీనరాశిలో శుక్రుడు దహనం కావడం వల్ల మీనరాశి జాతకులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎక్కువ దూరాలు ప్రయాణం చేయడం మంచిది కాదు. విద్యార్థులకు అంత సానుకూలమైన ఫలితాలు ఉండవు. సాహిత్యం మరియు కళా రంగంలో ఉన్నవారికి అనేక అడ్డంకులు వస్తాయి.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+