కొన్ని గంటల్లో ఈ రాశులను వెతికి మరీ వేధించనున్న కష్టాలు.. బుధుడి హుకుం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడుగా భావిస్తారు. ఇక గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు బృహస్పతి పాలించే ధనుస్సు రాశిలో సంచారం చేస్తున్నాడు. జనవరి నాలుగో తేదీ ధనుస్సు రాశిలో సంచారాన్ని ప్రారంభించిన బుధుడు త్వరలో ధనస్సు రాశిలో అస్తమించబోతున్నాడు. జనవరి 18వ తేదీన ధనుస్సు రాశిలో బుధ అస్తమయం జరుగుతుంది.
ధనుస్సు రాశిలో బుధ అస్తమయం
ఇక ఈ అస్తమయం కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. సహజంగా బృహస్పతి బుధ గ్రహాలు రెండు శత్రు గ్రహాలు. ఈ రెండింటికి మధ్య వైరం ఉంటుంది. కాబట్టి బుధ గ్రహ అస్తమయం కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది.

మేషరాశి
మేష రాశి వారికి బుధ అస్తమయం అనేక ఇబ్బందులను కలిగిస్తుంది. మేష రాశి వారు బుధ గ్రహ సంచార సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మేష రాశి వారికి అనేక ఆటంకాలు వస్తాయి. ఆర్థిక వ్యవహారాల పైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. ఈ సమయంలో మంచి ఫలితాలు కావాలంటే మేషరాశి జాతకులు పనిపైన దృష్టి పెట్టి కష్టపడితే మంచి ఫలితాలు సాధించగలుగుతారు.
సింహరాశి
సింహ రాశి వారికి బుధ అస్తమయం కారణంగా కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహ రాశి వారి ప్రేమ జీవితం లో కష్టాలు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో సింహ రాశి వారికి ఖర్చులు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల పైన సింహరాశి జాతకులు దృష్టి సారించడం మంచిది.
ధనుస్సు రాశి
బుధుడు అస్తమించడం వల్ల ధనుస్సు రాశి వారిపైన ప్రతికూల ప్రభావాలు పడతాయి. ధనుస్సు రాశి వారి ఆరోగ్యం బుధాస్తమయంతో క్షీణించే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాలలో ధనస్సు రాశి జాతకులు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి పెట్టే సమయంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
వృషభరాశి
వృషభ రాశి వారి పైన బుధ గ్రహ అస్తమయ ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. వృషభ రాశి వారి ఆర్థిక పరిస్థితులను ఇది ప్రభావితం చేస్తుంది. వృషభ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక సమస్యలు రావడమే కాకుండా బాగా నష్టపోయే అవకాశం కూడా ఉంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకుండా ఉంటేనే మంచిది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications