కొత్త ఏడాదిలో మొదటి చంద్రగ్రహణం.. వీరికి సమస్యలతో చుక్కలే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం మాత్రమే కాదు మరికొన్ని ఖగోళ ఆవిష్కరణలు కూడా రాశుల జీవితాలను ప్రభావితం చేస్తాయి. 2025 సంవత్సరంలో ఏర్పడే చంద్ర గ్రహణాలు, సూర్యగ్రహణాలు అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తాయి. 2025 సంవత్సరంలో మార్చి 14వ తేదీన శుక్రవారం ఉదయం 9 గంటల 29 నిమిషాలకు మొదటి చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అదేరోజు మధ్యాహ్నం 3 గంటల 29 నిమిషాలకు చంద్రగ్రహణం పూర్తవుతుంది.
2025లో మొదటి చంద్రగ్రహణం
ఈ చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణంగా ఉండనుంది. ఈసారి ఈ చంద్రగ్రహణం ఆసియా, యూరప్, ఆస్ట్రేలియా, అమెరికాలోని చాలా ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇక ఈ చంద్రగ్రహణం ఫలితంగా కొన్ని రాశుల వారు కష్టాలను ఎదుర్కోబోతున్నారు. మరి చంద్రగ్రహణం కారణంగా కష్టాలను ఎదుర్కునే ఆ రాశులు ఏమిటి ? ఆ కష్టాల నుంచి ఏ విధంగా ఉపశమనం పొందాలి? నివారణలు ఏమిటి? అనేది ప్రస్తుతం తెలుసుకుందాం.

సింహరాశి
చంద్రగ్రహణం కారణంగా ప్రభావితమయ్యే రాశులలో సింహరాశి ఒకటి. సింహ రాశి వారికి ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. పనిచేసే చోట శత్రువులు తయారవుతారు. చంద్రగ్రహణం వీరికి ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. దీని నుండి బయటపడాలంటే సింహ రాశి వారు శివుడిని ఆరాధించాలి.
మకర రాశి
మకర రాశి వారికి చంద్రగ్రహణం ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. మకర రాశి వారికి చంద్రగ్రహణం ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. పనిచేసే చోట ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసికంగాను సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. మకర రాశి వారి చంద్రగ్రహణం యొక్క ప్రతికూల ఫలితాల నుండి బయటపడాలంటే మహావృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ శివ పూజ చేయాలి.
మీనరాశి
మీన రాశి వారికి మొదటి చంద్రగ్రహణం కష్టాలను తెచ్చిపెడుతుంది. ఈ సమయంలో శత్రువులు అనేక ఇబ్బందులను సృష్టిస్తారు. భార్యాభర్తల మధ్య సంబంధాలు చెడిపోతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం పైన కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ చంద్రగ్రహణం కారణంగా వచ్చే ప్రతికూల ప్రభావాలను నివారించడానికి మీనరాశి జాతకులు తెల్లని వస్తువులను నిరుపేదలకు దానం చేయాలి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య శాస్త్ర పండితుల అభిప్రాయాలు, సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications