హోలీకి ముందే గజకేసరి రాజయోగంతో ఈ రాశులవారికి స్వర్ణయుగం ఆరంభం!

వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు కదలికలు ఎంతో ముఖ్యమైనవి. నవగ్రహాలలో చంద్రుడు అత్యంత వేగంగా కదిలే గ్రహం. చంద్రుడు ప్రతీ రాశిలో దాదాపు రెండున్నర రోజులపాటు ఉంటాడు. ఈ గ్రహ కదలికల సమయంలో ఇతర గ్రహాలతో సంయోగం జరిగినప్పుడు కొన్ని శుభ మరియు కొన్ని అశుభయోగాలు ఏర్పడతాయి. అయితే హోలీ పండుగకు ముందు శక్తివంతమైన యోగాలలో ఒకటైన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది.

గజకేసరి రాజయోగం
చంద్రుడు మరియు బృహస్పతి సంయోగం జరిగినప్పుడు ఈ గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. మార్చి 5వ తేదీన ఉదయం 8.12 నిమిషాలకు బృహస్పతి ఉన్న వృషభ రాశిలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగం ఏర్పడింది. ఈ రాజయోగం 12 రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనివల్ల ప్రయోజనాలను పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

The golden age begins for these zodiac signs with Gajakesari Raja Yoga before Holi

వృషభ రాశి
2025 హోలీ కి ముందు వృషభ రాశి వారి లగ్న గృహంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇదే వృషభ రాశి వారికి చాలా ప్రయోజనాలను కలిగిస్తుంది. వృషభ రాశి వారి జీవితంలోని అన్ని రంగాలలో పురోగతికి అవకాశాలను ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో కెరీర్లో పురోగతిని పొందుతారు. దీర్ఘకాలిక సవాళ్లు ముగిసిపోతాయి. ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. సంపదలు పెరుగుతాయి.

మిధున రాశి
2025 హోలీకి ముందు మిధున రాశి వారి 12వ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల మిధున రాశి వారికి సానుకూల ప్రయోజనాలు కలుగుతున్నాయి. మిధున రాశి వారి జీవితంలో పురోగతికి అవకాశం ఉంది. ఈ సమయంలో భవిష్యత్తు ప్రయోజనాలకు కావలసిన కీలక నిర్ణయాలను తీసుకుంటారు. విద్యారంగంలో ఉన్నవారు గొప్ప వృద్ధిని సాధిస్తారు. ఈ దశ మీ జీవితంలో సంతోషాలను, విజయాలను తెస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి.

కర్కాటక రాశి
2025 హోలీ కి ముందు కర్కాటక రాశి వారి పదకొండవ ఇంట్లో గజకేసరి రాజయోగం ఏర్పడడం వల్ల వీరు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. కర్కాటక రాశి వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పనిలో మీ ప్రయత్నాలకు మంచి ప్రతిఫలం వస్తుంది. సంతోషకరమైన పని వాతావరణం ఉంటుంది. నాయకత్వ సామర్థ్యాలు పెరుగుతాయి. కెరీర్ లో ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. ఏది కోరుకున్నా ఈ సమయంలో నెరవేరుతుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+