ఈనెల 28వ తేదీలోగా ఈ రాశుల జీవితం మారిపోతుంది.. సంపద పెరుగుతుంది
గ్రహాల రాకుమారుడు బుధుడు. తెలివితేటలు, తర్కం, లెక్కలు, వ్యాపారానికి రాకుడు. జ్ఞానాన్ని కూడా ఇస్తాడు. నవంబరు 10వ తేదీ నుంచి 18 రోజులపాటు తిరోగమనంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితాల్లో ఊహించని రీతిలో మార్పులు చోటుచేసుకోబోతున్నాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలను తెలుసుకుందాం. అయితే కొన్నిసార్లు ఇక్కట్లు కూడా వచ్చే అవకాశం ఉందికానీ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి బుధుడిని పూజించడంద్వారా అవి తొలగిపోతాయి.
మిథున రాశి
రచన, కళలు, పత్రిక, సంపాదకీయంతోపాటు అన్ని మీడియా రంగాల్లో ఉన్నవారికి అంతా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీడియాకు, రచనలకు చెందినవారే లాభపడతారు. బుధుడి తిరోగమనం వీరికి అద్భుతరీతిలో కలిసిరాబోతోంది.

వృషభ రాశి
ఆర్థికంగా మంచి ప్రయోజనాలు దక్కుతాయి. అహకంరాన్ని వదిలిపెడితే విజయం సాధిస్తారు. ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు. మంచి లాభాలను ఆర్జిస్తారు. వ్యాపారస్తులకు అన్నివిధాలుగా కలిసివస్తుంది. కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. మనస్పర్థలన్నీ తొలగిపోతాయి.
మకర రాశి
మంచి లాభాలున్నాయి. ఉద్యోగులకు పై అధికారుల నుంచి మద్దతు లభిస్తుంది. ఈ రాశివారు మాటలతో, ప్రసంగాలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. ఉద్యోగస్థులకు మాత్రం అన్నిరకాలుగా విశేషమైన ప్రయోజనాలు కనపడుతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలకు వెళతారు. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కన్యా రాశి
సాంకేతికపరమైన వృత్తుల్లో ఉన్నవారికి బాగా కలిసివస్తుంది. గతంలో మొదలై నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. సీనియర్ల నుంచి ఉద్యోగస్థులకు వారి వారి కార్యాలయాల్లో మద్దతు లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న అపార్థాలన్నీ తొలగిపోతాయి. ఆత్మవిశ్వాసంతో పనులన్నింటినీ పూర్తిచేస్తారు. వృత్తుల్లో ఉన్నవారికి ఆర్థిక లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications