అక్టోబర్ నెలంతా ఈ రాశులవారికి సంపదలు, రాజభోగాలు ఇస్తున్న ముఖ్య గ్రహాలు!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి మాసానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది .ఈ క్రమంలో జ్యోతిష్యం ప్రకారం త్వరలో రానున్న అక్టోబర్ నెల అనేక ముఖ్యమైన గ్రహాల గోచారంతో ద్వాదశ రాశుల వారి జాతకాన్ని మార్చేస్తుంది. అక్టోబర్ మాసంలో బుధుడు, అంగారకుడు, సూర్యుడు,శని, శుక్ర గ్రహాల గోచారం అనేక మార్పులకు కారణం అవుతుంది. ముఖ్య గ్రహాల గోచారం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.
అక్టోబర్ లో ముఖ్య గ్రహాల రవాణా
అక్టోబర్ 10వ తేదీన బుధుడు తులారాశిలో ప్రవేశిస్తున్నాడు. అక్టోబర్ 13వ తేదీన శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేయనున్నాడు. అక్టోబర్ 17వ తేదీన సూర్యుడు తులా రాశిలోకి ప్రవేశించనున్నాడు .ఇక అక్టోబర్ 20వ తేదీన కర్కాటక రాశిలో అంగారక సంచారం జరగనుంది. ఈ గ్రహాల గోచారం కారణంగా అనేక శుభయోగాలు ఏర్పడుతున్నాయి.

అక్టోబర్ నెలలో కలిసొచ్చే రాశులు
తులారాశిలో శుక్రుడు సూర్యుడు యుతి కారణంగా శుక్రాదిత్య రాజయోగం ఏర్పడనుంది .అంతేకాదు అక్టోబర్ నెలలోనే శని నక్షత్రం మార్పు కూడా సంభవించనుంది. అక్టోబర్ మూడవ తేదీన శని పూర్వభద్ర నక్షత్రం నుంచి శతభిషా నక్షత్రం లోకి సంచారం చేయనుంది. ఇక ఈ గ్రహాల సంచారం కారణంగా అక్టోబర్ మాసంలో కొన్ని రాశుల వారికి ధనలక్ష్మి కటాక్షం కలుగుతుంది . ప్రస్తుతం ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.
కన్యారాశి
కన్యా రాశి జాతకులకు అక్టోబర్ మాసం అన్ని విధాల లాభాలను చేకూరుస్తుంది. ఈ సమయంలో వీరు ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. ఉద్యోగులకు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంది. ఈ సమయంలో విద్యార్థుల చదువులోనూ పురోగతి కనిపిస్తుంది. పోటీ పరీక్షలలో కన్యారాశి జాతకులు రాణిస్తారు.
సింహరాశి
సింహరాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. సింహరాశి జాతకులకు అక్టోబర్ మాసంలో ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. పనిచేసే చోట గౌరవ మర్యాదలు దొరుకుతాయి. అనారోగ్య సమస్యలు తీరుతాయి. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. చేతికి అందకుండా నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు వీలుంటుంది.
వృషభ రాశి
వృషభ రాశి జాతకులకు అక్టోబర్ నెల అత్యంత శుభప్రదంగాను, లాభదాయకంగానూ ఉంటుంది. ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతులు వస్తాయి. నూతన ఉద్యోగాలకు అవకాశం కూడా మెరుగుపడుతుంది. వ్యాపారులు అధిక లాభాలను ఆర్జిస్తారు. కుటుంబంలో సుఖసంతోషాలు ఉంటాయి. ఈ సమయం వృషభ రాశి వారికి అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications