అస్తమిస్తూ వీరికి అఖండ ధన సంపదలను, సుఖ జీవనాన్ని వరమిస్తున్న చంద్రుడు!

జ్యోతిష్య శాస్త్రంలో చంద్రగ్రహానికి ప్రాధాన్యత ఉంటుంది. చంద్రుడు జూలై 24వ తేదీ నుండి జులై 26వ తేదీ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తాడు. జులై 26వ తేదీన సింహరాశిలోకి వెళతాడు. అయితే కర్కాటక రాశిలోకి వెళ్లిన సమయంలో చంద్రుడు ఉదయం నాలుగు గంటల నలభై నాలుగు నిమిషాలకు అస్తమిస్తాడు. తిరిగి జులై 26 రాత్రి ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఉదయిస్తాడు.

చంద్రుడి అస్తమయం.. లాభం వచ్చే రాశులు
చంద్రుడు ఉదయించే సరికి సింహ రాశిలోకి వెళతాడు. కర్కాటక రాశిలో చంద్ర సంచారం, ముఖ్యంగా చంద్రుడి అస్తమయం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో వారు సంతోషంగా, ఆర్ధికంగా బలంగా ఉంటారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

The setting moon bestows upon them immense wealth and a happy life

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి చంద్రుడు అస్తమించడం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయం వీరికి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ సమయంలో మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి ఉద్యోగం వస్తుంది. వ్యాపారవేత్తలకు వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. వైవాహిక జీవితం సంతోషదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పనిచేసే చోట ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి.

సింహరాశి
సింహ రాశి వారికి చంద్రుడు అస్తమయం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ సమయంలో సింహ రాశి వారి ఆరోగ్యం బాగుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సింహ రాశి వారికి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ఆకస్మిక ధన లాభం వస్తుంది. నూతన ఉద్యోగాల కోసం ఎదురు చూసే వారికి కొత్త ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగాలు చేసేవారు పనిలో విజయాలను సాధిస్తారు. ఇది సింహ రాశి వారికి అదృష్ట సమయం.

కన్యారాశి
కన్యా రాశి వారికి చంద్రుడు అస్తమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులకు విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కన్య రాశి వారి సంబంధాలు మెరుగుపడతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. జూలై 24 తర్వాత మీరు పెట్టుబడులు పెట్టడానికి సమయం బాగుంటుంది. ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగా ఉంటుంది.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+