త్వరలో నవ్వే ఆకాశం.. చూసిన వారిదే అదృష్టం!
ఏప్రిల్ మాసంలో చివరి వారంలో ఆకాశంలో అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఏప్రిల్ మాసంలో ముఖ్య గ్రహాల అరుదైన అమరిక ఆకాశంలో కనువిందు చేయబోతుంది. అద్భుతాలకు కేరాఫ్ అయిన ఖగోళ ప్రపంచంలో త్వరలోనే మరొక అద్భుత దృశ్యం మనకు కనిపించి కనువిందు చేయబోతుంది.
ఆకాశంలో ట్రిపుల్ కంజంక్షన్
ఏప్రిల్ 25వ తేదీన తెల్లవారుజామున శుక్ర గ్రహం, శని గ్రహం, చంద్రుడు ఒకే ప్రాంతంలో అత్యంత సమీపంగా ప్రత్యక్షమవుతాయి. ఈ మూడు గ్రహాలు స్మైలీ ఆకారాన్ని పోలి అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఏర్పరుస్తాయి. ఏప్రిల్ 25వ తేదీన ఏర్పడే ట్రిపుల్ కంజంక్షన్ చూసినవారికి అదృష్టాన్ని ఇస్తుంది. ఆకాశం తన రెండు కళ్ళతో చూస్తూ చక్కని స్మైలీ తో మనల్ని అందర్నీ పలకరించే రోజు త్వరలోనే రాబోతుంది.

త్రిభుజాకారంలో అమరి కనువిందు చేసే మూడు గ్రహాలు
ఇక ఆ రోజున ఆకాశంలో ఈ అద్భుతమైన దృశ్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడవలసిందే. శుక్రుడు, శని వాటి కింద సన్నని నెలవంక రూపంలో చంద్రుడు ఆకాశంలో ఒకదానికి ఒకటి దగ్గరగా వచ్చి త్రిభుజాకారంలో అమరి కనిపిస్తాయి. ఇది చూసే ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. మార్నింగ్ స్టార్ అని పేరున్న మెరిసే తెల్లని కాంతిని కలిగి ఉండే శుక్రుడు ఆకాశంలో పై భాగంలో ఉంటాడు.
స్మైలీ ఆకారంలో ఆకాశంలో గ్రహాల అమరిక
ఆ తర్వాత కాస్త మసకగా కనిపించే శని ఎడమవైపు కొంచెం కింది భాగంలో ప్రకాశిస్తాడు. ఇక సన్నని నెలవంక ఈ రెండిటికీ కింది భాగంలో కనిపిస్తుంది . నెలవంక ప్రకాశవంతమైన అంచు చిరునవ్వు మాదిరిగా కనిపిస్తుంది. దీంతో ఆకాశం నవ్వుతున్నట్టు గోచరిస్తుంది. ఎవరైతే ఈ దృశ్యాన్ని చూస్తారో వారి జీవితంలో సంతోషం ఉంటుందని కొందరు చెబుతున్నారు.
కొన్ని రాశులకు శుభ ఫలితాలు
ఏప్రిల్ చివరి వారంలో చోటు చేసుకునే ఈ ఆకాశ అద్భుతాన్ని చూసినవారంతా అదృష్టవంతులు అవుతారని చెబుతున్నారు. ఈ అమరిక కారణంగా కొన్ని రాశుల వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఏప్రిల్ 25 నుండి కొన్ని రాశులు శని, శుక్ర, చంద్ర గ్రహాల కలయిక కారణంగా శుభ ఫలితాలను పొందుతారు. అయితే వారి వారి జన్మ చార్టుల ఆధారంగా ఆ ఫలితాలు ఉంటాయి.












Click it and Unblock the Notifications