త్వరలో రథంపై వస్తూ ఈ రాశులవారికి డబ్బుల మూటలు తెస్తున్న సూర్యుడు!

నవగ్రహాలు వేటికవే ప్రత్యేకమైనవి. గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఆయా రాశుల వారి జీవితాల పైన గణనీయమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ముఖ్యంగా గ్రహాలలో, గ్రహాల రారాజుగా చెప్పే సూర్యుడు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ వివిధ రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తున్నాడు. సూర్యుడు ఒక రాశి నుంచి మరక రాశిలోకి నెలరోజుల కాలంలో సంచారం చేస్తాడు.

వృషభ రాశిలో సూర్యుడు
నెలకొక రాశిలో సూర్య సంచారం జరుగుతుంది. మొత్తం ద్వాదశ రాశుల సంచారాన్ని సూర్యుడు సంవత్సర కాలంలో పూర్తి చేస్తాడు. ప్రస్తుతం మేష రాశిలో ఉన్న సూర్యుడు మే 14వ తేదీ అర్ధరాత్రి, అంటే 15వ తేదీన వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. వృషభ రాశిలో సూర్య సంచారం కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. మరి ఆ రాశులను తెలుసుకుందాం.

The sun is coming soon on a chariot bringing bundles of money to these zodiac signs

మేషరాశి
వృషభ రాశిలో సూర్య సంచారం మేష రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది, మేష రాశి వారికి ధన, వాక్కు స్థానంలో సూర్య సంచారం జరుగుతుంది. కాబట్టి వీరు ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలలో పురోగతిని చూస్తారు. ఆస్తి సమస్యలు పరిష్కారమై ఆర్థికంగా పురోగతి కలుగుతుంది.

వృషభ రాశి
వృషభరాశిలో సూర్య సంచారం వృషభ రాశి జాతకులకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. వృషభ రాశి జాతకులు ఈ సమయంలో గణనీయమైన ప్రయోజనాలను పొందుతారు. సూర్యుడు వీరికి ఉద్యోగ జీవితంలో పురోగతిని, వర్తక వ్యాపారాలలో లాభాలను ఇస్తాడు. ఆరోగ్యాన్ని ఇస్తాడు.

కర్కాటక రాశి
సూర్య సంచారం కర్కాటక రాశి జాతకులకు మేలు చేస్తుంది. కర్కాటక రాశి జాతకులు సూర్య సంచారంతో ఆర్థిక లాభాలను, ఉద్యోగ ప్రయోజనాలను పొందుతారు. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసినా కలిసి వస్తుంది.

సింహరాశి
సింహ రాశి వారికి సూర్యుడు రాశి మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. సూర్య సంచారం కారణంగా సింహరాశి జాతకులకు కష్టాలు తొలగిపోయి జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా మంచి సమయం.

కన్యారాశి
సూర్యుడు కన్యారాశిలో పదవ ఇంట్లో సంచరిస్తాడు. కన్య రాశిలో సూర్య సంచారం సింహరాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరు ఏ పని చేసిన కలిసి వస్తుంది. ఎంతోకాలంగా పరిష్కారం కాని సమస్యలు ఈ సమయంలో పరిష్కారం అవుతాయి.

మకర రాశి
సూర్య సంచారం కారణంగా మకర రాశి వారికి శుభ ఫలితాలు వస్తాయి. వీరికి తండ్రి నుండి సహాయం లభిస్తుంది. మకర రాశి జాతకులు సూర్య సంచారంతో ఆర్థికంగా ప్రయోజనాలను పొందటమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందుతారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+