వినాయక చవితి నుండి వీరి జాతకమే మారిపోతుంది.. మీరున్నారా?
త్వరలో వినాయక చవితి పండుగ రాబోతుంది. ఆగస్టు 27వ తేదీన భాద్రపద శుక్ల చవితి నాడు మనం వినాయక చవితి పండుగను జరుపుకుంటాము. ఆగస్టు 27 నుండి తొమ్మిది రోజుల పాటు గణేష్ నవరాత్రులను నిర్వహించుకుంటాం. వినాయక చవితి నాడు ఐదు శుభయోగాలు ఏర్పడుతున్నాయి. రవి యోగం, బ్రహ్మయోగం, ఇంద్ర యోగం, ప్రీతియోగం, సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ యోగాల కారణంగా కొన్ని రాశులవారు అదృష్ట జాతకులు అవుతున్నారు.
మేషరాశి
మేష రాశి వారికి వినాయక చవితి నుండి మంచి ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో పెట్టిన పెట్టుబడులు లాభాలను ఇస్తాయి. ఇప్పటినుండి ఏ పని చేసిన మేష రాశి వారికి కలిసి వస్తుంది. మేషరాశి జాతకుల కోసం ఈ సమయంలో కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వినాయకుడి కటాక్షం వీరిపైన పుష్కలంగా ఉంటుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి వినాయక చవితి పండుగ నుండి కలిసి వస్తుంది. కర్కాటక రాశి వారికి వినాయక చవితి నాడు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు. వినాయక చవితి నుండి వీరికి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కర్కాటక రాశి వారి ఆర్థిక స్థితి మెరుగు పడుతుంది.
తులారాశి
తులా రాశి వారికి ఈ సమయంలో కలిసి వస్తుంది. వినాయక చవితి నుండి వీరు వృత్తిపరంగా శుభ ఫలితాలను చూస్తారు. ఒంటరిగా ఉన్న వారికి జీవిత భాగస్వామి దొరుకుతుంది. వీరికి అదృష్టం కలిసి వస్తుంది. ఏ పని చేసిన మంచి ఫలితాలు వస్తాయి.
మకర రాశి
వినాయక చవితి పండుగ మకర రాశి వారి జీవితాన్ని మారుస్తుంది. వినాయక చవితి నుండి వీరు శుభవార్తలు వింటారు. సంతోషంగా జీవిస్తారు. ఎప్పటినుంచో వసూలు కావలసిన మొండి బాకీలు వసూలవుతాయి. బ్యాంకు బ్యాలెన్స్ పెరుగుతుంది. పనిచేసే చోట ఉద్యోగుల మద్దతు లభిస్తుంది. మంచి పేరు వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications