వాలెంటైన్స్ డే నుండి అదృష్ట రాశులు ఇవే.. వీరి ప్రేమకు అవధుల్లేవ్!
ఈరోజు ప్రేమికుల దినోత్సవం. ప్రేమికుల దినోత్సవం రోజు గ్రహాల గమనం చాలా ప్రత్యేకంగా నిలుస్తుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలలో ఒకటిగా చెప్పబడుతుంది. శుక్రుడు విలాసాలకు, లగ్జరీలకు, ప్రేమ, పెళ్లి వంటి సంబంధాలకు అనుకూలమైన గ్రహంగా చెబుతారు.
లవ్ లైఫ్ ఎంజాయ్ చేసే రాశులు
ఎవరి జాతకంలో శుక్రుడు బలంగా ఉంటాడో వారికి త్వరగా పెళ్లవుతుందని చెబుతారు. అయితే ఈ సంవత్సరం కొన్ని రాశుల వారికి శుక్రుడు బలం మెరుగ్గా ఉంది . వాలెంటైన్స్ డే సందర్భంగా శుక్రుడి కటాక్షంతో ఈ సంవత్సరం లవ్ లైఫ్ ను ఎంజాయ్ చేసే, పెళ్లి చేసుకునే ఆ రాశులను గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి ఈ సంవత్సరం చాలా అద్భుతంగా ఉంటుంది. మంచి ఫలితాలు వస్తాయి. కెరీర్ పరంగాను బాగుంటుంది. ఆర్దిక పురోగతి ఉంటుంది . ప్రేమలో ఉన్నవారికి ఈ సంవత్సరం శుక్రుడు బలం కారణంగా కచ్చితంగా పెళ్లయ్యే సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం వృషభ రాశి వారు ఉత్తమ ఫలితాలను పొందుతారు.
కర్కాటక రాశి
కర్కాటకరాశి వారికి ఈ సంవత్సరం శుక్రుడి బలం బాగా కనిపిస్తుంది. శుక్రుడి బలం కారణంగా కర్కాటకరాశి జాతకులకు అన్ని విధాల శుభాలే జరుగుతాయి. కర్కాటకరాశికి చెందిన వారి ప్రేమ, పెళ్లి విషయంలో గొప్ప మార్పులు చోటుచేసుకోబోతున్నాయి. ఈ సంవత్సరం ప్రేమలో ఉన్న వారి లవ్ సక్సెస్ అవుతుంది. పెళ్లి చేసుకోవాలనుకుంటున్న వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. వీరి ఆర్థిక జీవితం, ఆరోగ్యం అద్భుతంగా ఉంటాయి.
తులారాశి
తులారాశికి చెందినవారు ఈ సంవత్సరం శుక్రుడి కటాక్షంతో సంతోషంగా జీవిస్తారు. తులా రాశి వారి తమ ప్రేమ విజయవంతం కావడంతో పాటు ప్రేమిస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటారు. ఈ సమయంలో ఆర్థికంగా తులా రాశి వారు బలోపేతం అవుతారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకున్న వారు కూడా చాలా సంతోషంగా జీవిస్తారు. తులా రాశి వారి ఆర్థిక జీవితం కుటుంబ జీవితం బాగుంటుంది. వీరి ఆరోగ్యం బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications