హోలీ తర్వాత వీరే మహర్జాతకులు... తేల్చిచెప్పిన శని సూర్యులు!

మార్చి నెలలో నాలుగు ప్రధాన గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడంతో పాటు అనేక శుభయోగాలను ఏర్పరుస్తున్నాయి. ముఖ్యంగా మార్చిలో శనిదేవుడు కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తుండగా, అంతకుముందే సూర్యుడు కూడా మీనరాశిలోకి ప్రవేశించనున్నాడు. మరోవైపు శుక్రుడు, బుధుడు కూడా వక్ర మార్గంలో ప్రయాణించనున్నారు. ఇలా నాలుగు ముఖ్య గ్రహాల రవాణాతో పాటు శని సూర్యుల కలయిక ద్వాదశ రాశులవారి జాతకాలు మారుస్తుంది.

మీనరాశిలో శని సూర్యుల కలయిక
హోలీ పండుగ తర్వాత మార్చి 29వ తేదీన మీనరాశిలో శని సూర్యుల కలయిక వలన అద్భుతమైన శుభయోగం ఏర్పడుతుంది. 30 సంవత్సరాల తర్వాత శని సూర్యుల కలయిక మీనరాశిలో జరగడం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఆ రాశులు ఏమిటో ప్రధానంగా తెలుసుకుందాం.

These are the Maharajas after Holi The Sun and Saturn conjunction

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శని సూర్యుల సంయోగం లాభదాయకంగా ఉంటుంది. ఈ సమయంలో కర్కాటక రాశి వారి సంపద పెరుగుతుంది. వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. కర్కాటక రాశి వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తవుతాయి.

కన్యారాశి
శని సూర్యుల సంయోగం వలన కన్యా రాశి వారు లబ్ధిని పొందుతారు. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు. ఇంటికి బంధువులు రావడంతో కుటుంబంలో సంతోషం వెల్లి విరుస్తుంది. వివాహాలు జరిగే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మాటలతోనే మనసు గెలుచుకుంటారు. ఇది కన్యా రాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.

మీన రాశి
శని సూర్యుల సంయోగం కారణంగా మీన రాశి వారికి చాలా ఫలవంతంగా ఉంటుంది మీనరాశిలో ఈ రెండు గ్రహాలు కలిసి ఉండటం వల్ల మీనరాశి జాతకులకు సంపద పెరుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేవారు అన్ని విధాలుగా విజయాలను సాధిస్తారు. మీనరాశి వారు ఓపికతో పని చేస్తే మంచి ఫలితాలను చూస్తారు. ఆర్థికస్థితి మెరుగుపడుతుంది. ఇది మీనరాశి వారికి శుభసమయం.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+