ఈ నెలలో వీరికే రాజభోగాలు, సంపదలని తేల్చేసిన మూడు గ్రహాలు
డిసెంబర్ మాసంలో ముఖ్యమైన గ్రహాలు తమ తమ రాశులను మార్చుకుంటున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, బుధుడు, సూర్యుడు తమ రాశిని మార్చుకుంటున్నారు. శుక్రుడు ఏకంగా రెండుసార్లు రాశిని మార్చుకోవడం పలు రాశుల వారికి సంపదలను కలుగజేస్తుంది. ఇక ఈ మూడు ముఖ్య గ్రహాల సంచారం కారణంగా అదృష్ట రాశుల వారు ఎవరు అనేది అనేది ప్రస్తుతం మనం తెలుసుకుందాం.
డిసెంబర్ మాసంలో గ్రహాల సంచారం
డిసెంబర్ రెండవ తేదీన శుక్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఆపై డిసెంబర్ 28వ తేదీన శుక్రుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు. ఇక డిసెంబర్ 15వ తేదీన సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. డిసెంబర్ 15వ తేదీన బుధుడు వృశ్చిక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. ఈ మూడు గ్రహాల సంచారం మూడు రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తున్నాయి.

వృషభ రాశి
డిసెంబర్ నెలలో శుక్రుడు బుధుడు రవి గ్రహాల సంచారం కారణంగా వృషభ రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ నెల అంతా వీరికి శుభప్రదంగా ఉంటుంది. వృషభ రాశి జాతకులకు ఏ పని చేసిన అదృష్టం కలిసి వస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. వ్యాపారంలో భారీ లాభాలు వస్తాయి. వ్యాపారాలను అభివృద్ధి చేసేందుకు ఇది దోహదం చేస్తుంది. ఇది వృషభ రాశి వారికి మంచి కాలం.
సింహరాశి
మూడు గ్రహాల సంచారం కారణంగా సింహరాశి జాతకులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో సింహ రాశి వారికి భారీగా ధనం వస్తుంది. మీరు డబ్బును రెట్టింపు చేయడానికి ఆస్కారం ఉంటుంది. పెట్టుబడులు పెట్టాలని చూసే వారికి అనుకూలమైన సమయం. ఈ రాశి జాతకుల వర్తక వ్యాపారాలు బాగా పురోగతి సాధిస్తాయి. వ్యాపారులకు ఇది మంచి కాలం. ఇది మీకు మరియు మీ జీవిత భాగస్వామికి మధ్య సంబంధాలను మెరుగుపరుస్తుంది.
మకర రాశి
మూడు గ్రహాలు తమ రాశిని మార్చుకోవడం వల్ల మకర రాశి వారికి భారీగా లాభాలు వస్తాయి . మకర రాశి జాతకుల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం బాగుంటుంది, శ్రమకు తగిన ప్రతిఫలం ఉంటుంది. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. వర్ధక వ్యాపారాలు చేసేవారు పురోగతిని సాధిస్తారు డబ్బు ఆదా చేసుకుంటారు. ఇది పెట్టుబడులు పెట్టేందుకు కూడా అనుకూలమైన సమయం .కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇది అన్ని విధాలుగా మకర రాశి జాతకులకు అదృష్ట సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications