సంపద, ఆదాయం పెరగడానికి ఇంటికి ఉండాల్సిన వాస్తు నియమాలు ఇవే

వాస్తు శాస్త్రం అనేది కేవలం ఇల్లు కట్టుకోవడానికి సంబంధించినదే అని చాలామంది భావిస్తారు. అయినప్పటికీ కొన్నిరకాల ఇబ్బందులు కుటుంబ సభ్యులకు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించేందుకు వాస్తు నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వీటిని పాటించడంవల్ల ఆర్థికంగా జీవితంలో ఎదుగుతారని, ప్రశాంతంగా జీవిస్తారని, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని చెబుతున్నారు. మనం పాటించాల్సిన ఆ వాస్తు నియమాలను ఒకసారి తెలుసుకొని పాటిద్దాం.

వాస్తు ప్రకారం ఇంటి సింహ ద్వారం నుంచే సంపద లోపలికి ప్రవేశిస్తుంది.
ప్రతిరోజు వాకిలి శుభ్రం చేసి, నీటితో కడిగి ముగ్గులేస్తుండాలి.
ప్రధాన ద్వారం దగ్గర చీకటి ఉండకూడదు. ఎప్పుడూ వెలుతురే ఉండాలి.
తలుపు తీసేటప్పుడు కిర్రు మంటూ చప్పుడు చేయకూడదు.

These are the Vastu principles that a house should follow for increased wealth and income

కుళాయిల నుంచి నీరు కారుతుంటే ఆపేయాలి.
లీకులుంటే మరమ్మతులు చేయాలి.
నీరు చుక్కలుగా కూడా పడకూడదు.
అలా అయితే డబ్బు వృథాగా ఖర్చవుతుంది.

వారానికోసారి ఇంటిని తుడిచే నీటిలో కల్లు ఉప్పు వేసి తుడవాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి పోయి ధనాకర్షణ కలుగుతుంది.

రాత్రివేళ వంటగదిలో ఎంగిలి గిన్నెలు ఉండకూడదు.
వాటిని వెంటనే శుభ్రం చేసుకోవాలి.
దీనివల్ల లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది.
బియ్యం, ఉప్పు ఎప్పుడూ అయిపోకుండా చూసుకోవాలి.
ఇంట్లో తులసి మొక్క లేదంటే మనీప్లాంట్ పెంచుకోవాలి.
కాక్టస్ లాంటివి ఉండకూడదు.
సాయంత్రం అన్ని గదుల్లో లైట్లు వేయాలి.
పూజగదిలో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించినట్లవుతుంది.

ఈశాన్యం ఎంత ఖాళీగా ఉంటే అంత మంచిది.
సంపద కూడా అంత మంచిగా వస్తుంది.
ఆ మూల ఎంతో శుభ్రంగా ఉండాలి.
ఎందుకంటే ఈశాన్యం అనేది దేవుడు ఉండే చోటు.
ఈ ప్రాంతంలో బరువైన వస్తువులు ఉండకూడదు.
చిన్న గిన్నెలో నీరు పోసి, తాజా పూలు పెట్టి ఉంచాలి.
దీనివల్ల ప్రతికూల శక్తి పోయి, సానుకూల శక్తి ప్రవేశిస్తుంది.

ఉత్తర దిశలో బీరువా ఉండాలి.
డబ్బులుండే చోట చిన్న అద్దాన్ని అమర్చాలి.
దీనివల్ల సంపద రెట్టింపు అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+