సెప్టెంబర్ లో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టేది వీరే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో బుధ గ్రహాన్ని గ్రహాల రాకుమారుడిగా పిలుస్తారు. బుధుడు తెలివితేటలు, జ్ఞానం, వాణిజ్యం, వాక్చాతుర్యం వంటి అంశాలకు కారకుడు. బుధుడు నేడు తన మిత్ర గ్రహమైన సూర్యుని రాశి అయిన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సింహరాశిలో బుధ సంచారం చాలా సానుకూలంగా పరిగణించబడుతుంది.
బుధాదిత్య రాజయోగం
బుధుడికి మరియు సూర్యుడికి మధ్య స్నేహం ఉండడం వల్ల ఈ మార్పు శుభ ఫలితాలను ఇస్తుంది. ఇక ఇదే సమయంలో సూర్యుడు కూడా సింహరాశిలో ఉండడంవల్ల ఈ రెండు గ్రహాల కలయిక బుధాదిత్య రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ బుధాదిత్య రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రాబోతున్నాయి. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభ రాశి వారికి బుధాదిత్య రాజయోగం సానుకూల ఫలితాలను ఇస్తుంది. వృషభ రాశిలో నాలుగవ ఇంట్లో బుధాదిత్య రాజయోగం ఏర్పడడం వల్ల ఈ రాశి వారు అనేక రంగాలలో సానుకూల మార్పులను చూస్తారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. సంపదలు మరియు భౌతిక సుఖాలు పెరుగుతాయి. తల్లితో సంబంధాలు మెరుగుపడతాయి.
సింహరాశి
సింహ రాశి వారికి బుధాదిత్య రాజయోగం మంచి ఫలితాలను ఇస్తుంది. సింహరాశిలో లగ్న గృహంలో బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. సింహరాశిలో లాభ మరియు సంపద గృహానికి అధిపతి అయినందువల్ల లగ్న గృహంలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశి వారు అన్ని విధాల మంచి ఫలితాలను పొందుతారు ఆత్మవిశ్వాసంతో సవాళ్లను అధిగమిస్తారు. అన్ని రంగాలలోనూ విజయాలను సాధిస్తారు.
ధనుస్సు రాశి
బుధాదిత్య రాజయోగం ధనుస్సు రాశి జాతకులను అదృష్ట జాతకులు గా మారుస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి వారు అదృష్టాన్ని పొందుతారు. జీవితంలో అనేక సానుకూల అవకాశాలను పొందుతారు. విదేశీయానం చేసే అవకాశం ఉంటుంది. విద్యార్థులకు, ఉద్యోగస్తులకు శుభాలు జరుగుతాయి. ఈ సమయంలో ధనుస్సు రాశి వారి శుభవార్తలు వింటారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. కొత్త పెట్టుబడులు, భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలంగా ఉంటాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications