శని దయతో చరిత్ర సృష్టించబోతున్న రాశులు వీరే
మనం చేసిన కర్మల ప్రకారం ఫలితాలను ప్రసాదిస్తాడు శనిదేవుడు. ఆయన న్యాయదేవత. మంచి చేసినవారికి రెండింతలు మంచి ఫలితాలు, చెడు చేసినవారికి అంతకు నాలుగు రెట్లు ఎక్కువగా ఫలితాలనిస్తాడు. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చే శని నక్షత్రాన్ని కూడా మారుస్తుంటాడు. దాదాపు 27 సంవత్సరాల తర్వాత భాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీనివల్ల కొన్ని రాశులవారి జీవితం ఒక్కసారిగా మారిపోతోంది. జీవితంలో వారు కొత్త చరిత్రను సృష్టిస్తారని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు.
మిథున రాశి
కొత్తగా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగా జరగడంతోపాటు కొత్త వినియోగదారులు వస్తారు. ఇతర ప్రాంతాలకు తమ వ్యాపారాలను విస్తరించడానికి ఇది అనువైన సమయం. గతంలో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి ప్రస్తుతం బలోపేతమవుతారు. నలుగురికి సాయం చేసే స్థాయికి చేరుకుంటారు. ఎదుటివారిని విమర్శించకూడదు. ప్రతిరోజు నవగ్రహాలకు ప్రదక్షిణ చేసి, శనిదేవుడిని పూజిస్తే బాగా కలిసివస్తుంది.

మకర రాశి
కొత్త కొత్త రంగాల్లో ఈ రాశివారు చరిత్రను సృష్టించబోతున్నారు. అనేకరకాల ఆర్థిక ప్రయోజనాలను అందుకుంటారు. కొత్తగా ఉద్యోగంలో చేరడానికి ఇది అనువైన సమయం. వ్యాపారం ప్రారంభించడానికి కూడా ఇది మంచి సమయం. ఒకరకంగా ఈ రాశివారు కొత్త కొత్త రంగాల్లో చరిత్ర సృష్టించబోతున్నారని చెప్పొచ్చు. జీవిత భాగస్వామి సలహా సంప్రదింపులతో చేసే పనుల్లో ఆర్థిక లాభాలను ఆర్జిస్తారు. సమాజంలో గౌరవాన్ని అందుకుంటారు.
కుంభ రాశి
ఆదాయం భారీగా పెరుగుతుంది. దీనివల్ల కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు. వ్యాపారస్తులు మంచి లాభాలను అందుకుంటారు. వాటిని ఇతర రంగాల్లో పెట్టుబడి పెడతారు. కొత్త ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం ఈ రాశివారికి లభిస్తుంది. దీనివల్ల వీరు విజయం సాధించి ఆర్థిక లాభాలను అందుకుంటారు. పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తారు.












Click it and Unblock the Notifications