మార్చిలో ఏనుగు కుంభస్థలాన్ని బద్దలుకొట్టి సంపన్నులయ్యే రాశులివే!
వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాలు ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాల స్థాన చలనం కారణంగా కొన్ని యోగాలు ఏర్పడతాయి. అయితే మార్చి మాసంలో నాలుగు ముఖ్య గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉన్నప్పటికీ, మార్చి నెల అంతా తిరోగమనంలో సంచరించబోతున్నాడు.
మార్చి నెలలో గ్రహాల సంచారం
ఇక బుధుడు మార్చి మాసంలో మీన రాశిలోకి సంచరించబోతున్నాడు. మార్చి 14వ తేదీన రవి. మీనరాశిలోకి వెళ్ళనున్నారు. ఇక మార్చి చివరలో శని కూడా మీనరాశిలోకి సంచారం చేస్తాడు. ఈ నాలుగు గ్రహాలు ఒకేసారి ఒక రాశిలోకి చేరడం వల్ల కొన్ని రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతున్నాయి. ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
శుక్రుడు మీనరాశిలో ఉచ్చ స్థితిలో ఉండడంతో పాటు నాలుగు గ్రహాలు ఆ రాశిలో సంచరించడం కారణంగా వృషభ రాశి వారికి లాభ స్థానం బలపడి లబ్ది జరుగుతుంది. వీరి ఆదాయ వనరులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వృత్తి వ్యాపారాలలో నూతన అవకాశాలు వస్తాయి. ఆర్థికంగా మంచి మార్పులు వస్తాయి. కుటుంబ జీవితం బాగుంటుంది.
మిధున రాశి
మీనరాశిలో నాలుగు గ్రహాల సంచారం కారణంగానూ అంతేకాదు మిధున రాశిలో దశమ స్థానంలో ఈ గ్రహాల బలం పెరగడం వల్ల మిధున రాశి వారికి కెరీర్ బాగుంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఏ ప్రయత్నం చేసినా విజయవంతం అవుతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఉద్యోగుల డిమాండ్ పెరిగి మంచి ఆఫర్ దొరుకుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి భాగ్యస్థానంలో గ్రహాల బలం పెరగడం వల్ల వీరికి మంచి మార్పులు వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. షేర్ల ద్వారా అపారమైన లాభాలు వచ్చే అవకాశం ఉంది. విదేశాలలో ఉద్యోగ అవకాశాలు పొందే ఛాన్స్ ఉంది. ఇది కర్కాటక రాశి వారికి అదృష్ట సమయం.
కన్య రాశి
కన్యా రాశి వారికి సప్తమ స్థానంలో గ్రహాల సంచారం కారణంగా మీరు సానుకూల ఫలితాలు పొందుతారు. కన్యారాశి వారి ఆదాయం వృద్ధి చెందుతుంది. వీరి కుటుంబంలో ధన ప్రవాహం ఉంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన వ్యక్తితో సంబంధాలు ఏర్పడతాయి. నిరుద్యోగులకు, ఉద్యోగులకు మంచి అవకాశాలు వచ్చే వీలుంది.
ధనుస్సు రాశి
ఈ రాశికి చతుర్థ స్థానంలో గ్రహాల కలయిక కారణంగా కుటుంబంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. వైవాహిక, కుటుంబ సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగంలో రాజయోగాలు కలుగుతాయి. ఆస్తుల పంచాయితీలు పరిష్కారం అవుతాయి. సొంతింటి కొనుగోలు సాధ్యమవుతుంది.
మకర రాశి
ఈ రాశి వారికి తృతీయ స్థానంలో రాజయోగాలు ఏర్పడడం వల్ల, గ్రహాల సంయోగం వల్ల మకర రాశి వారి ప్రతి ప్రయత్నం విజయవంతం అవుతుంది . బంధుమిత్రులు, అధికారులు, సహోద్యోగుల సహాయం ద్వారా మకర రాశి వారు పురోగతి సాధిస్తారు. వీరికి ప్రయాణాల ద్వారా శుభాలు కలుగుతాయి.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications