2025 జనవరిలో పులిపంజా చీల్చి ఐశ్వర్యం పొందే రాశులివే!
2025 సంవత్సరం జనవరి మాసం.. కొత్త సంవత్సరంలో మొదటి మాసానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో మనం అత్యంత ఇష్టంగా జరుపుకునే సంక్రాంతి పండుగ వస్తుంది. అంతేకాదు ఈ మాసంలో అనేక కీలక గ్రహాల సంచారం అన్ని రాశులపైన ప్రభావం చూపుతుంది. ద్వాదశ రాశుల వారి జాతకాలలో గ్రహాల రవాణా కారణంగా అనేక సానుకూల, ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి.
జనవరి మాసంలో కీలక గ్రహాల సంచారం
ఇక ఈ ఏడాది మనిషి జీవితం పైన ప్రభావం చూపించే గ్రహాల సంచారం జనవరి నెలలో కీలకం కానుంది. అన్ని రాశులపైన ప్రధాన గ్రహాల సంచార ప్రభావం పడనుంది. ఇక జనవరి నెలలో గ్రహాల సంచారం ఏ విధంగా ఉంటుంది?ఏ గ్రహం ఏ రాశిలో కి ఎప్పుడు ప్రవేశిస్తుంది? వంటి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. జనవరి 2025లో జరిగే గ్రహ సంచారాలు శుభ ప్రారంభాలుగా చెప్పవచ్చు.

ముఖ్య గ్రహాల సంచారం ఇలా
బుధుడు జనవరి 4న ధనుస్సు రాశిలోకి ప్రవేశించి, జనవరి 24న మళ్లీ మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు జనవరి 14న మకరరాశిలోకి సంచరిస్తాడు. ఇక కుజుడు జనవరి 21న మిథునరాశిలోకి సంచరిస్తాడు. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు జనవరి 27న మీనరాశిలోకి సంచరిస్తాడు. శని కుంభరాశిలో ఉంటాడు. గురువు వృషభరాశిలో ప్రత్యక్షంగా వెళుతుంది. ఈ గ్రహ సంచారాలు అన్ని రాశులవారిని ప్రభావితం చేస్తాయి.
మేష రాశి
మేషరాశి వారికి జనవరి మాసం కలిసి వస్తుంది. ఈ సమయంలో మేషరాశి జాతకులు ఏ పని చేసినా విజయం సాధిస్తారు. పనులలో పురోగతి ఉంటుంది. చాలా కాలంగా పరిష్కారం కాని సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇది మేషరాశి జాతకులకు వర్తక, వ్యాపారాలు చేసే వారికి శుభసమయం. మేషరాశి వారు ఇప్పుడు ఆర్ధికంగా పురోగతి సాధిస్తారు.
తుల రాశి
జనవరి 2025 లో తులా రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా చాలా ప్రత్యేకమైన ఫలితాలు కలుగుతాయి. తులా రాశి జాతకులు ఈ సమయంలో ఏ పని చేసిన విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగం చేసే వారికి ముఖ్యమైన బాధ్యత వస్తుంది. తులా రాశి జాతకులు జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ పనులను విజయవంతంగా ప్లాన్ చేసుకుంటారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి.
కుంభరాశి
2025 సంవత్సరంలో జనవరి నెల కుంభ రాశి వారికి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కుంభ రాశి జాతకులకు ఇది అదృష్ట మాసంగా మారుతుంది. ఆరోగ్యంగా ఉంటారు. కుంభ రాశి వారికి ఈ నెలలో భౌతిక సుఖాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. డబ్బు విషయంలో ఎటువంటి ఢోకా ఉండదు. ఈ సమయంలో వీరు అనేక ఇబ్బందులను సవాళ్లను అధిగమించి ముందుకు సాగుతారు .
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications