దీపావళి తర్వాత ఈ అద్భుతయోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాశుల వారి జీవితాలపైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక అక్టోబర్ మాసంలో కూడా ముఖ్య గ్రహాల సంచారం కొన్ని రాశుల వారి జీవితాలను మార్చేస్తుంది. అక్టోబర్ మాసంలో దీపావళి రాబోతుంది. అక్టోబర్ 20వ తేదీన దేశవ్యాప్తంగా దీపావళి పండుగను జరుపుకుంటారు.
చతుర్గ్రాహి యోగం
ఆ తర్వాత అక్టోబర్ 22న సూర్యుడు, బుధుడు, కుజుడు, చంద్రుడు నాలుగు గ్రహాలు కలిసి తులా రాశిలో సంచారం చేస్తాయి. తులా రాశిలో ఈ నాలుగు గ్రహాలు చతుర్గ్రాహి యోగాన్ని ఏర్పరుస్తాయి. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేషరాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మేషరాశి జాతకులు దీపావళి తర్వాత అదృష్ట జాతకులు అవుతున్నారు. ఈ సమయంలో మీరు అనేక విజయాలను అందుకుంటారు. వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పెళ్ళికాని వారికి పెళ్లి సంబంధాలు కుదురుతాయి. పనిలో ప్రశంసలు పొందుతారు. ఉద్యోగాలు చేసేవారు కెరీర్ లో అభివృద్ధిని చూస్తారు. నూతన వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.
మకర రాశి
చతుర్గ్రాహి యోగం కారణంగా మకర రాశి జాతకులు సానుకూల ఫలితాలను చూస్తారు. దీపావళి తర్వాత సంభవించే ఈ యోగం కారణంగా ఈ సమయంలో వీరికి అన్ని శుభ ఫలితాలే వస్తాయి. వృత్తిపరంగా వీరికి కలిసి వస్తుంది. ఉద్యోగంలో విజయాలను అందుకుంటారు. జీవితంలో వేగవంతమైన వృద్ధి కనబడుతుంది. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. నూతన ఒప్పందాలను చేసుకోవడానికి ఇది సరైన సమయం. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
కుంభరాశి
చతుర్గ్రాహి యోగం కుంభరాశి జాతకులను సంతోషంలో ముంచెత్తుతుంది. ఈ రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. పనులలో ఇబ్బందులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఈ సమయంలో కుంభరాశి వారు విజయాలను అందుకుంటారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి ఇది మంచి సమయం. కుంభ రాశి జాతకులు ఈ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదిస్తారు. పేరు ప్రతిష్టలు పొందుతారు. పెట్టుబడులకు ఇది సరైన సమయం.
disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications