త్వరలో గౌరీయోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి సంపన్నులయ్యే రాశులవారు వీరే!

వేద జ్యోతిష్య శాస్త్రంలో జూలై చివరి వారంలో నక్షత్రాల గమనం, వివిధ రాశుల్లోకి గ్రహాలకు మనం కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాకుండా శ్రావణమాసం కూడా ప్రారంభం అవుతుండడం, శని మీనరాశిలో తిరోగమనం చేయడం వంటి ఘటనలతో పాటు ఒక అద్భుతమైన యోగం ఏర్పడుతుంది.

గౌరీ యోగం
అత్యంత అద్భుతమైన గౌరీ యోగం ఈ వారంలో ఏర్పడుతుంది. ఈ యోగంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. వారు ఈ సమయంలో ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. కుటుంబంలో శుభవార్త లను వింటారు. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

These are the zodiac signs that will soon get wealth with Gauri Yoga

మేషరాశి
జులై చివరి వారంలో మేషరాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వారం ప్రారంభంలో మతపరమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు. వ్యాపారస్తులకు లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు ప్రశంసలు లభిస్తాయి. ఖర్చులు పెరుగుతాయి. మేషరాశి లోని విద్యార్థులకు ఈ వారం బాగా కలిసి వస్తుంది. ఏ పని చేసిన విజయం వరిస్తుంది.

కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి జూలై చివరివారం ఆర్థిక ప్రయోజనాలను కలిగిస్తుంది. కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి ఇది అనువైన సమయం. ఉద్యోగస్తులకు కూడా సానుకూలంగా ఉంటుంది. పెళ్ళికాని వారు శుభకార్యాలలో పాల్గొనే అవకాశం ఉంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేసే వారు విజయాలు సాధిస్తారు. ఇది కర్కాటక రాశి వారికి శుభ సమయం.

సింహరాశి
సింహ రాశి వారు జులై చివరి వారంలో కష్టపడి పనిచేసి మంచి ఫలితాలను పొందుతారు. సింహరాశి జాతకులు శ్రమకు ప్రాధాన్యత నిస్తే అద్భుతంగా రాణిస్తారు. జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారు ఈ సమయంలో దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయవలసి రావచ్చు.

కన్యా రాశి
కన్యా రాశి వారికి జులై చివరి వారంలో శుభప్రదంగా ఉంటుంది. కన్యారాశి జాతకులు ఈ సమయంలో శుభ వార్తలు వినే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారంతో ప్రతి పనిని సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలలో పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. ఇది కన్యా రాశి వారికి మంచి సమయం.

వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జూలై చివరి వారంలో అదృష్టం కలిసి వస్తుంది. గౌరీ యోగం కారణంగా వీరి కోరికలు నెరవేరుతాయి ఉద్యోగస్తులకు సానుకూల ప్రయోజనాలు కలుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసే మహిళలు శుభవార్తలు అందుకుంటారు. భూములు భవనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+