దీపావళి తర్వాత కుజ సంచారంతో పులిపంజా చీల్చి కోటీశ్వరులయ్యే రాశులవారు వీరే!
జ్యోతిష్య శాస్త్ర ప్రకారం కుజుడు ప్రతి 6 నుండి 8 వారాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటాడు .కుజుడు ప్రస్తుతం కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. ధనత్రయోదశి, దీపావళి పండుగల తర్వాత అక్టోబర్ 27వ తేదీన సాయంత్రం 3 గంటల 53 నిమిషాలకు కుజుడు తన సొంత రాశి అయిన వృశ్చిక రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 7, రాత్రి 8 గంటల 27 నిమిషాల వరకు వృశ్చిక రాశిలో ఉంటాడు.
వృశ్చిక రాశిలో కుజ సంచారం
వృశ్చిక రాశిలో కుజ సంచారం కొన్ని రాశుల వారికి చాలా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వృశ్చిక రాశిలో కుజ సంచారం కారణంగా అదృష్టాన్ని పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

సింహరాశి
సింహరాశి జాతకులు వృశ్చికరాశిలో కుజ సంచారం కారణంగా సానుకూల ఫలితాలను పొందుతారు. సింహరాశి జాతకులకు కుజుడు శుభాలను చేకూరుస్తారు. ఈ సమయంలో వీరు ఆస్తులను కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. అదృష్ట గృహానికి అధిపతి అయిన కుజుడు సంచారం కారణంగా మీరు విదేశీయానం చేసే అవకాశం ఉంది. సింహరాశి వారికి వ్యాపార లాభాలు గణనీయంగా ఉంటాయి. ఉద్యోగంలో ఉన్నవారు ఆర్థిక లాభాలను అనుభవిస్తారు.
వృశ్చిక రాశి
కుజ సంచారం వృశ్చికరాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. కుజుడు మీ రాశి చక్రానికి అధిపతి కావడంతో మీ జాతకంలో లగ్న గృహంలో సంచారం చేస్తాడు. దీని ఫలితంగా వృశ్చికరాశి వారి ధైర్య, పరాక్రమాలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. నూతన ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలని ఆలోచించేవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. కొత్త ఇల్లు, కొత్త ఆస్తులు, వాహనాలు కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన సమయం.
మీన రాశి
మీనరాశిలో కుజ సంచారం ఈ రాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. కుజుడు మీ రాశి నుండి సంచారం చేయడం వల్ల మీకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీన రాశి వారు పెండింగ్ పనులు పూర్తి చేస్తారు. ఇది మీన రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆస్తులను కొనుగోలు చేయవచ్చు. తల్లిదండ్రుల మద్దతుతో చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. వ్యాపారంలో లాభాలు సంపాదించడానికి అనేక.అవకాశాలు వస్తాయి. ఉపాధి కోరుకునే వారికి ఉద్యోగాలు లభిస్తాయి.
Disclaimer: ఈ కథనం జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications