పరమ శివుడికి ఇష్టమైన రాశులవారు వీరే.. వీరి పంట పండుతుంది!
మహాశివరాత్రి పర్వదినం శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున శివపార్వతులను అత్యంత భక్తిశ్రద్ధలతో పూజించి ఉపవాస, జాగరణ దీక్షలు ఆచరించి భక్తులు విశేషంగా జరుపుకుంటారు. హిందువులంతా ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ పండుగ నాడు ప్రత్యేకమైన అభిషేకాలు, పూజలు నిర్వహించడం వల్ల శివుడి అనుగ్రహం కలుగుతుంది.
శివుడికి ఇష్టమైన రాశులు
జీవితంలో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక మహాశివరాత్రి పర్వదినాన కొన్ని రాశులవారు శివుడిని పూజించడం వల్ల ఊహించని లాభాలు పొందుతారు. అయితే పరమశివుడు అనుగ్రహంతో అనేక ప్రయోజనాలను పొందే రాశులు, శివుడికి అత్యంత ఇష్టమైన రాశులు కూడా ఉన్నాయి. వాటిని గురించి ప్రస్తుతం తెలుసుకుందాం.

వృషభ రాశి
శివునికి ఎంతో ఇష్టమైన రాశులలో వృషభ రాశి ఒకటి. మహాశివరాత్రి రోజున శివుడిని పూజించడం వల్ల అనేక ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ఆకస్మిక ధన లాభాలు కలుగుతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి బాగుంటుంది ఏ పని చేసిన విజయం వరిస్తుంది.
మిధున రాశి
మిధున రాశి వారి పైన శివుడి అనుగ్రహం ఉంటుంది. మహాశివరాత్రి నుంచి మిధున రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. కెరీర్ పరంగాను బాగుంటుంది. కోరుకున్న కోరికలు తీరుతాయి. శివయ్య కటాక్షంతో మిధునరాశి వారు సంతోషంగా జీవిస్తారు.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి శివుడి అనుగ్రహం వల్ల ఆర్థికంగా బాగుంటుంది. దీర్ఘకాలికంగా వస్తున్న సమస్యలు తొలగిపోయి కర్కాటక రాశి వారికి లబ్ధి చేకూరుతుంది. వ్యాపారాలు చేసే వారికి మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం రెట్టింపు అవుతుంది. విదేశాల్లో చదువుకునే వారికి అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి.
ధనుస్సు రాశి
శివుడికి ఎంతో ఇష్టమైన రాశులలో ధనుస్సు రాశి ఒకటి. ఈ రాశి వారికి మహాశివరాత్రి నుంచి ప్రయోజనాలు బాగుంటాయి. నూతన పనులు ప్రారంభించి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఆర్థికపరమైన చిక్కులు తొలగిపోయి సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా సమస్యలు తొలగిపోతాయి.
కుంభరాశి
శివునికి ఎంతో ఇష్టమైన రాశులలో కుంభరాశి కూడా ఒకటి . ఈ రాశి వారు మహాశివరాత్రి పర్వదినాన శివపార్వతులను పూజించడం వల్ల మంచి ఫలితాలను పొందుతారు. శివుని కటాక్షంతో ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసే వారికి ప్రయోజనాలు చేకూరుతాయి. కుటుంబపరంగా ఎన్నో లాభాలు వస్తాయి. వీరి సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ సమయంలో వీరు విజయాలను సాధిస్తారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.
-
కుంభరాశి, మీన రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
today rashiphalalu: నేడు వీరింటికి నడిచొచ్చేను లక్ష్మీదేవి.. తలుపులు తెరవండి! -
today rashiphalalu: చతుర్గ్రాహియోగంతో 12 రాశులలో ఈ రాశులవారికి కుబేరయోగం! -
వాస్తు ప్రకారం శనివారం రోజు ఈ పనులు చేయండి.. కలిసివస్తుంది -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
వాస్తు ప్రకారం వంటగదిలో ఈ వస్తువులు ఉండకూడదు.. ఒకసారి చూసుకోండి -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications