సరిగ్గా 8రోజుల్లో లక్ష్మీ నారాయణ రాజయోగంతో నక్కతోక తొక్కే రాశులివే!
వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవగ్రహాలు వివిధ రాశులలో సంచారం చేస్తూ అన్ని రాశుల వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి. గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు సంచారం చేస్తూ ఇతర గ్రహాలతో సంయోగం చెందుతూ, కొన్ని యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని శుభయోగాలు కాగా కొన్ని అశుభ యోగాలు.
లక్ష్మీ నారాయణ యోగం
ఆగస్ట్ నెలలో కర్కాటక రాశిలో 21వ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక జరగనుంది. ఈ రెండు గ్రహాల కలయిక కారణంగా లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఆగస్టు 21వ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక చంద్రుడు సొంత రాశి అయిన కర్కాటక రాశిలో ఏర్పడనుంది. కర్కాటక రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కొన్ని రాశులవారికి శుభ ఫలితాలు వస్తాయి. లక్ష్మీ నారాయణ యోగం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటో తెలుసుకుందాం.

మేష రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మేష రాశి వారికి బాగా కలిసి వస్తుంది. మేష రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా అనే ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో మీరు కష్టాల నుంచి బయటపడతారు. వర్తక వ్యాపారాలు చేసేవారు లాభాలు గడిస్తారు. కెరీర్ పరంగా మంచి పురోగతి ఉంటుంది. వివాహాలు కానీ వారికి ఈ సమయంలో వివాహం అయ్యే యోగం ఉంది.
కర్కాటక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారికి శుభాలు జరుగుతాయి. ప్రతి రంగంలోనూ వీరు విజయాలను సాధిస్తారు. వీరికి గతం కంటే ఎక్కువ అవకాశాలు ఈ సమయంలో వచ్చే ఛాన్స్ ఉంది. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. పూర్వీకుల నుండి ప్రయోజనాలను పొందుతారు. ఇది కర్కాటక రాశి వారికి శుభాలను ఇచ్చే సమయం.
కన్యా రాశి
కన్యా రాశి వారికి లక్ష్మీనారాయణ యోగం కారణం సానుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ విజయాలను అందుకుంటారు. ఈ సమయంలో వీరి కెరీర్లో ఊహించని విధంగా పురోగతిని సాధిస్తారు.ఏ పని చేసిన కన్యా రాశి వారికి సక్సెస్ వచ్చి తీరుతుంది. లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా వీరు అనుభవించిన కష్టాలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
తులారాశి
తులారాశి వారికి లక్ష్మీ నారాయణ రాజయోగం కారణంగా లబ్ది జరుగుతుంది. ఈ సమయంలో తులారాశి జాతకులు అన్ని విధాలా ప్రయోజనాలను పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్ లు వస్తాయి.పై అధికారుల మద్దతు లభిస్తుంది. తులారాశి వారి ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఎప్పటి నుండో వసూలు కాని మొండి బాకీలు వసూలవుతాయి.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications