ఆగస్టులో లక్ష్మీనారాయణ రాజయోగంతో లక్కీ ఫెలోస్ అయ్యేది వీరే.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో నవ గ్రహాలు నిర్దిష్ట కాలమానం ప్రకారం ఒక రాశి నుండి మరొక రాశిలోకి సంచారం చేస్తూ ఉంటాయి. గ్రహాలు వివిధ రాశులలోకి మార్పు చెందటం వలన కొన్ని రాశులవారికి శుభ యోగాలు, మరికొన్ని రాశులవారికి అశుభ యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాల ప్రభావం ద్వాదశ రాశులవారిపైన ఉంటుంది. ఆగస్ట్ నెలలో లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పడుతుంది.
లక్ష్మీ నారాయణ రాజయోగం
ఆగస్టు 28వ తేదీన బుధ శుక్ర గ్రహాల కలయిక చంద్రుడి సొంత రాశి అయిన కర్కాటక రాశిలో జరుగుతుంది. దీని ఫలితంగా కర్కాటక రాశిలో లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశులకు శుభ ఫలితాలను ఇస్తుంది. లక్ష్మీనారాయణ రాజయోగం ఆగస్టు మాసంలో లబ్ది పొందే ఆ రాశుల గురించి ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభరాశి
ఆగస్టు మాసంలో లక్ష్మీనారాయణ రాజయోగం వృషభ రాశి జాతకులకు శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వీరికి అనేక లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా ఈ సమయంలో బలోపేతం అవుతారు. వృషభ రాశి వారి ప్రేమ జీవితం బాగుంటుంది. అన్ని విషయాలలో వృషభ రాశి వారు విజయాలను సాధిస్తారు.
వృశ్చిక రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం వృశ్చిక రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు గతం కంటే ఎక్కువ మెరుగైన ఫలితాలను పొందుతారు. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతి రంగంలోనూ వీరు విజయాలను సాధిస్తారు. ఈ సమయం వీరికి అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. ఇది వృశ్చిక రాశి వారికి అదృష్ట సమయం.
మీన రాశి
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా మీనరాశి జాతకులు సానుకూల ఫలితాలను పొందుతారు. మీన రాశి వారు చేసే ప్రతి పనిలోనూ విజయాలను సాధిస్తారు. ఈ యోగం వీరికి సక్సెస్ ను అందిస్తుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు పొందుతారు. కష్టాలన్నీ తొలగిపోయి ఆర్థికంగా లాభాలతో పాటు శుభాలు చేకూరుతాయి. ఏ పని చేసిన మీన రాశి వారికి సక్సెస్ వస్తుంది. ఇది వీరికి కలిసొచ్చే కాలం.
Disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications