ఈ రాశులవారి కోసం మూడు గ్రహాల ఎదురుచూపులు
గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేస్తుంటాయి. ఇలాంటి తరుణంలోనే జ్యోతిష్యం ప్రకారం కీలకమైన ఆగస్టు నెలలో బుధుడు, అంగారకుడు, శుక్రుడు సంచరించబోతున్నారు. సింహరాశిలో ఉన్న బుధుడు ఈనెల 22వ తేదీన కర్కాటక రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. 26వ తేదీన అంగారకుడు మిథునరాశిలోకి, 25వ తేదీన శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశిస్తున్నారు. గ్రహాల కదలికలో మార్పులు రావడంవల్ల కొన్ని రాశులకు విపరీతంగా కలిసిరానుంది.
సింహ రాశి
సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటాయి. ప్రస్తుతం వస్తున్న ఆదాయంతోపాటు ఇతర మార్గాల నుంచి కూడా ఆదాయం వస్తుంది. కొన్ని శుభవార్తలను కూడా ఇదే సమయంలో అందుకుంటారు. జీవిత భాగస్వామి నుంచి ఊహించని రీతిలో ప్రయోజనం కలుగుతుంది. ఆస్తితోపాటు వ్యాపారంవల్ల కూడా లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో తలపెట్టే పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలన్నీ తగ్గుముఖం పడతాయి.

మిథున రాశి
ఆర్థిక పరిస్థితిలో మార్పు చేర్పులు చోటుచేసుకుంటాయి. కుటుంబ సభ్యులు లేదంటే సన్నిహితులతో కలిసి తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళ్లే అవకాశం కనపడుతోంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఇప్పటివరకు కూడబెట్టిన సంపదలో కొంతభాగం తగ్గుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మార్పులుంటాయి. వ్యాపారస్తులకు మంచి ఒప్పందాలు కుదరడంతోపాటు అమ్మకాలు, కొనుగోళ్లలో లాభాలున్నాయి.
మేష రాశి
ఆస్తి విలువ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు తాము పనిచేసేచోట పై అధికారులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడటంవల్ల అంతా కలిసివస్తుంది. వ్యాపారస్తులకు మంచి లాభాలున్నాయి. కొత్తగా ప్రణాళికలు రచించుకొని వ్యాపారాన్ని విస్తరించాలనుకుంటారు. పాత స్నేహితుడిని కలుసుకోవడంవల్ల అంతా మంచి జరుగుతుంది. కష్టపడుతున్నప్పటికీ అనుకున్న స్థాయిలో ఫలితాలు రావడంలేదనే చింత ఉంటుంది. ఈ సమయంలో ఆ చింత తీరిపోతుంది.












Click it and Unblock the Notifications