ఈ రాశులవారికి డబ్బు, ఐశ్వర్యం, అపార సంపద... గురువు తిరోగమనం
జ్యోతిష్యం ప్రకారం, గ్రహాలు కాలానుగుణంగా తమ కదలికలను మార్చుకుంటాయి. ఈ క్రమంలో తిరోగమనం కూడా ఉంటుంది. వీటి ప్రభావం భూమితోపాటు మానవుల వ్యక్తిగత జీవితాలపై కూడా ఉంటుంది. కర్మ, న్యాయ ప్రదాత అయిన శని దేవుడు, వ్యాపారాన్ని ఇచ్చే బుధుడు, శ్రేయస్సును ఇచ్చే బృహస్పతి తిరోగమనంలో ఉన్నారు. అన్ని రాశులవారిపై ఈ ప్రభావం ఉంటున్నప్పటికీ మూడు రాశులవారికి మాత్రం ప్రత్యేక అనుగ్రహం ఉంది. ఏయే రాశులవారు.. వారికి ఎలా కలిసి వస్తుందో తెలుసుకుందాం.
కన్య రాశి : గురుడు, శని, బుధుడి తిరోగమన చలనం కన్యారాశివారికి చాలా శుభప్రదమవుతుంది. అనుకోకుండా చేతిలోకి డబ్బు వస్తుంది. మాట్లాడే మాటలు ఎదుటివారిపై తీక్షణ ప్రభావం చూపుతాయి. అదే సమయంలో మాట మృదువుగా ఉండటట్లు చూసుకోవాలి. మాటతీరు వల్ల ప్రజల్ని ఆకట్టుకుంటారు. కోరికలన్నీ నెరవేరతాయి. గతంలో మొదటి ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. వాహనాలు, ఆస్తులను కొనుగోలు చేసే అవకాశం ఉంది.

వృషభ రాశి : బుధుడు, శని, గురుడి కదలిక వీరికి అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులు తాము పనిచేసే చోట కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. అంతేకాకుండా జూనియర్లు, సీనియర్ల నుంచి మద్దతు పొందుతారు. ఆస్తిలో పెట్టుబడి పెట్టడంవల్ల లాభం ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పూర్వీకుల నుంచి ఆస్తి ప్రయోజనాలు దక్కుతాయి.
ధనస్సు రాశి : వీరు పనిచేసేచోట అభివృద్ధి చెందుతారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి. అదే సమయంలో సమాజంలో గౌరవ మర్యాదలు ఇనుమడిస్తాయి. మనసు ఆధ్యాత్మిక, మతపరమైన కార్యక్రమాలవైపు మొగ్గుచూపుతుంది. దీనివల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రయాణాలు చేస్తారు. ఈ ప్రయాణాలు కలిసివస్తాయి. కుటుంబ సభ్యులతో గౌరవంగా, మర్యాదగా వ్యవహరిస్తారు. తల్లి ఆరోగ్యంపట్ల శ్రద్ధ చూపాలి. కుటుంబ సభ్యుల నుంచి ఊహించని రీతిలో మద్దతు పొందుతారు.












Click it and Unblock the Notifications