ఒక్కసారిగా ధనవంతులు కాబోతున్నారు.. మీ రాశి ఉందా?
జ్యోతిష్యంలో బృహస్పతిని శుభప్రదమైన గ్రహంగా పరిగణిస్తారు. వ్యక్తి జాతకంలో ఇది శుభ స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ఆర్థిక పురోగతితో పాటు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. బృహస్పతి గ్రహాన్ని జ్ఞానం, పిల్లలు, విద్య, మతపరమైన పని.. మొదలైన వాటికి కారకంగా పరిగణిస్తారు. దేవగురువు బృహస్పతి ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్నాడు. కొన్ని రాశులవారిపై దీని ప్రభావం ఉండబోతోంది. ఏయే రాశులవారిపై ఉంటుందో తెలుసుకుందాం.
మేషరాశి: దేవగురువు తిరోగమనం ఈ రాశివారికి బాగా కలిసి రానుంది. ఉద్యగ, వ్యాపారాల్లో పలు లాభాలను పొందుతారు. జీవిత భాగస్వామితో అనుబంధం గట్టిపడుతుంది. తద్వారా వైవాహిక జీవితం మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా సమయాన్ని వెచ్చిస్తారు. సామాజిక సేవ చేసేవారికి ఈ సమయంలో ఊహించని లాభాలు కలగనున్నాయి. గతంలో మొదలై పెండింగ్ లో పడిపోయిన పనులన్నీ ఈ సమయంలో ప్రాంరభమవుతాయి.

మిథునరాశి: వ్యాపారంలో పెట్టిన పెట్టుబడివల్ల రెట్టింపు ఆదాయం పొందుతారు. వ్యాపారాల్లో నష్టం వస్తున్నవారికి ఈ సమయంలో మంచి పురోగతి ఉంటుంది. కొందరికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వైవాహిక జీవితంలో ఇప్పటివరకు ఉన్న సమస్యలు దూరమవుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.
వృశ్చికరాశి: ఆర్థిక ప్రయోజనాలు కలగనున్నాయి. బృహస్పతి నుంచి పుష్కలంగా ఆశీస్సులు లభిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి ఇంక్రిమెంట్ తో ప్రమోషన్ ఉంటుంది. వృత్తిలో ఉన్నవారికి ఇది బాగా కలిసివచ్చే సమయం. ఏపనిని ప్రారంభించే ముందైనా జీవిత భాగస్వామితో సంప్రదించి చేయడంవల్ల ఆ పని విజయవంతమవుతుంది.












Click it and Unblock the Notifications