ఈనెల 9న మౌని అమావాస్య.. ఈ రాశులపై అదృష్ట వర్షం
ఈనెల 9న మౌని అమావాస్య. పుష్యమాసంలో వచ్చే మొదటి రోజును మౌని అమావాస్యగా పేర్కొంటారు. ఆరోజు నదుల్లో స్నానం చేయడం ఎంతో పుణ్యప్రదం. స్నానం చేసిన తర్వాత ఎంతోమంది సాధువులు మౌనంగా ఉండి జ్ఞానాన్ని ఆర్జిస్తారు. ఆరోజు గంగానది నీరు అమృతంగా మారుతుంది. దీని ప్రభావం వల్ల ఆరు రాశులవారికి శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
మేషరాశి
పెద్ద పెద్ద ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. ప్రభుత్వం నుంచి నిధులు పొందుతారు. తమ యజమానితో మంచి సంభాషణను కొనసాగిస్తారు. జీవితం ఎంతో ఆహ్లాదకరంగా కొనసాగుతుంది. తల్లిదండ్రులతో సంబంధాలు బలోపేతమవుతాయి.

వృషభరాశి
విదేశాలకు వెళ్లేవారు శుభవార్తలను అందుకుంటారు. వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలున్నాయి. కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు. ఈ పనులు వారికి ఆర్థికంగా భారీ ప్రయోజనాలను కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలకు వెళతారు.
కర్కాటకరాశి
వీరి మనసు ప్రేమతో నిండివుంటుంది. కొత్త భాగస్వామిని కనుగొంటారు. దుస్తులు, ఆభరణాల్లాంటివి కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని విస్తరించేందుకు పెట్టుబడి ప్రతిపాదనలను వస్తాయి. ఇందులో మంచి పురోగతితోపాటు వైవాహిక జీవితంలో సంతోషం వెల్లివిరుస్తుంది.
వృశ్చికరాశి
అదృష్టం తోడుండటంవల్ల అన్ని పనులు పూర్తిచేయగలుగుతారు. ఆర్థికంగా మంచి ప్రయోజనాలున్నాయి. దూర ప్రయాణం చేస్తారు. ఇది కూడా లాభదాయకంగా ఉంటుంది. ఆహ్లాదకరమైన అనుభవాలతో జీవితం గడుస్తుంది.
మకరరాశి
కెరీర్ బాగుంటుంది. పనిచేసేచోట యజమానుల నుంచి గౌరవం లభించడంతోపాటు జీతంలో పెరుగుదల ఉంటుంది. డ్రైవింగ్ చేసే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మౌని అమావాస్య రోజు చేసే పనులన్నీ విజయం సాధిస్తాయి. ఎటువంటి ఆటంకాలు ఏర్పడవు.
మీనరాశి
వివాహానికి సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారం లేదంటే ఉద్యోగం.. రెండింటిలో ధనలాభం ఉంటుంది. తద్వారా ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. సంతోషంతోపాటు సౌకర్యాలు పెరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు కలుగుతాయి.












Click it and Unblock the Notifications