రాహు-కేతువు సంచారం... ఈ నలుగురికి మాత్రం కేక
జ్యోతిష్య శాస్త్రంలో రాహువు, కేతువులను పాప గ్రహాలుగా పరిగణిస్తారు. అక్టోబరు 30వ తేదీ మధ్యాహ్నం 1.33 గంటలకు ఇవి రెండూ తమ రాశులను మార్చుకుంటున్నాయి. రాహువు మేషరాశి నుంచి మీనరాశిలోకి, కేతువు తులారాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశిస్తారు. వీటి సంచారంవల్ల ప్రతి రాశివారిపై శుభ, అశుభ ప్రభావాలుంటాయి. అయితే నాలుగు రాశులవారికి మాత్రం బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం..
మేషరాశి:ఈ రాశివారికి వారి వృత్తి, పని రంగాల్లో విశేషమైన గౌరవం లభిస్తుంది. ఇంక్రిమెంటుతోపాటు ప్రమోషన్ పొందుతారు. ప్రయాణం చేస్తారు.. అది కూడా లాభసాటిగా ఉంటుంది. అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు. అందుకు అదృష్టం తోడుంది. ఉద్యోగానికి, వ్యాపారానికి ఇది చాలా అనుకూలమైన సమయంగా పరిగణిస్తున్నారు. జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

మిధునరాశి:ఈ రాశివారికి ఆదాయం పెరుగుతుంది. బోధనతో సంబంధం ఉన్న వృత్తుల్లో ఉన్నవారికి ఇది చాలా మంచి సమయం. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేస్తుంటే ఇది అనుకూలమైన సమయం. ఆరోగ్యం గతంలో కంటే మెరుగుపడుతుంది.
వృశ్చిక రాశి:ఈ రాశివారికి శుభ ఫలితాలున్నాయి. వాహనాన్ని కొనుగోలు చేస్తారు. వైవాహిక జీవితంలో మాధుర్యాన్ని రుచిచూస్తారు. వ్యాపారంలో లాభాలున్నాయి. ఉద్యోగస్తులకు వారు పనిచేసే ప్రాంతంలో యాజమాన్యం నుంచి, పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి.
ధనుస్సు రాశి:ఈ రాశివారికి ఉద్యోగంలో పైకెదుగుతారు. కొత్త పనిని ప్రారంభించడానికి మంచి సమయం. పలు వనరుల నుంచి డబ్బును అందుకుంటారు. ఆర్థికంగా బలోపేతమవుతారు. విద్యారంగంలో ఉన్నవారు విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు లాభాలున్నాయి.












Click it and Unblock the Notifications