శనిదేవుడి సంచారం.. ఈ రాశులపై కనక వర్షం
జ్యోతిష్యంలో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కొత్త సంవత్సరంలో శని సంచారం చేయకపోయినప్పటికీ కదలికలను మాత్రం మార్చనుంది. ఫిబ్రవరి 17వ తేదీ సాయంత్రం 6.43 గంటలకు శని సంచారంలో మార్పులు రానున్నాయి. అవి మార్చి 25వ తేదీ వరకు ఉంటాయి. కొన్ని రాశులవారిపై ఈ ప్రభావం ఉంటుందని పండితులు తెలియజేస్తున్నారు. దీనివల్ల ఏయే రాశులవారికి అదృష్టం కలిసిరానుందో తెలుసుకందాం.
ధనస్సు రాశి : వీరికి బాగా కలిసి వస్తుంది. ఉద్యోగాలు చేసేవారికి ప్రధానంగా బాగా కలిసి వస్తుంది. పై అధికారుల నుంచి మద్దతు లభించడంతోపాటు ప్రమోషన్లు కూడా పొందుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. విదేశాలకు వెళ్లేవారికి ఇది మంచి సమయం.

తులారాశి : ఆదాయంలో మార్పులు వస్తాయి. దీనివల్ల ఊహించని రీతిలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రమోషన్స్ వస్తాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కష్టాలన్నీ తొలగిపోవడంతో జీవితం చాలా బాగుంటుంది. పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలిచే జీవితాన్ని పొందుతారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.
వృషభ రాశి : గతంలో మొదలై నిలిచిపోయిన పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలున్నాయి. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. వృత్తి జీవితం గడుపుతున్నవారికి లాభాలున్నాయి. ఆర్థికంగా పరిస్థితి మెరుగవుతుంది. వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని చవిచూస్తారు. కుటుంబ సభ్యులతో గడపడానికే అధిక సమయాన్ని వెచ్చిస్తారు.












Click it and Unblock the Notifications