కర్కాటకరాశిలో బుధుడి సంచారం.. ఈ 5 రాశులపై అదృష్ట వర్షం

మిథున రాశిలో ఉన్న బుధుడు జూలై 8వ తేదీ నుంచి కర్కాటకరాశిలోకి ప్రవేశిస్తాడు. మూడువారాలపాటు అంటే ఈనెల 25వ తేదీ వరకు సంచరిస్తాడు. ఈ ప్రభావం అన్ని రాశులపై ఉన్నప్పటికీ ప్రత్యేకంగా కొన్ని రాశులవారికి బాగా కలిసి రానుంది. ఉద్యోగంతోపాటు వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది. అవి ఏయే రాశులనేది తెలుసుకుందాం.

మేష రాశి
కర్కాటక రాశిలో బుధుడి సంచారం ఈ రాశివారికి బాగా కలిసివస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. గతం నుంచి పెండింగ్ లో ఉన్న పనులు ఈ సమయంలోనే పూర్తవుతాయి. ఖర్చులు తగ్గి ఆదాయ వనరులు పెరుగుతాయి. వాహనాన్ని కొనుగోలు చేసే ఆలోచన ఉన్నవారికి వారి కోరిక నెరవేరుతుంది. ప్రేమతోపాటు వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి.

zodiac sign

వృషభ రాశి
ఈ రాశి వారికి మంచి పురోగతి ఉంటుంది. నిరుద్యోగులు మంచి పేరున్న కంపెనీలో ఉద్యోగం దక్కి స్థిరపడతారు. ఉద్యోగం చేసేవారు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయడంతోపాటు ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునేవారికి మాత్రం ఇది అనువైన సమయం కాదు.

కర్కాటక రాశి
ఈ రాశివారికి ఆర్థిక ప్రయోజనాలుంటాయి. వ్యాపారం బాగుంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. తికిరాదు అనుకున్న డబ్బు అందుతుంది. సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. దూరప్రయాణాలు చేయకపోవడమే మంచిది. తప్పనిసరైతేనే చేయాలి.

కన్యా రాశి
బుధుడి సంచారం వీరికి మేలు చేస్తుంది. కుటుంబ సభ్యుల నుంచి ఊహించనిరీతిలో మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు ఇది మంచి అనుకూలమైన సమయం. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. ఆదాయం పెరగడంతోపాటు ఊహించినదానికన్నా లాభం కలుగుతుంది.

zodiac sign

తులా రాశి
ఈ రాశివారి జీవితంలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. అనుకోకుండా గతంలోనే ప్రారంభమైన పనులు ఇప్పుడు పూర్తవుతాయి. పనిపట్ల మీకున్న అంకితభావం ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. ఆర్థికంగా కుదురుకుంటారు. కొత్త ఉద్యోగం సాధిస్తారు. మీపనిపై మీకు శ్రద్ధ పెరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+