ఈ రాశులవారు డ్రామా క్వీన్స్, ఎమోషనల్ కింగ్స్; అతిగా స్పందిస్తారు!!

మనం పుట్టినప్పటి నక్షత్రం, గ్రహాల చలనం బట్టి మనకు ఏ రాశి వర్తిస్తుందో చెబుతారు. రాశులను బట్టి కూడా ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, జీవన విధానం ఉంటుంది. సమాజంలో కొంతమంది చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ప్రతిస్పందిస్తూ ఉంటారు. కొంతమంది ఎంత పెద్ద సమస్య అయినా కూడా స్పందించరు. అయితే చిన్న చిన్న విషయాలకే భావోద్వేగ ప్రతిస్పందనలు కలిగినవారు కొన్ని రాశులకు చెందిన వారుగా ఉంటారని జ్యోతిష్యశాస్త్రం చెబుతుంది.

మేష రాశి : ముఖ్యంగా ఐదు రాశుల వారి లక్షణాలలో భావోద్వేగ ప్రతిస్పందనలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం. మేషరాశి వ్యక్తులు ఎక్కువగా భావోద్వేగం కలిగి ఉన్న వ్యక్తులు. మీరు త్వరగా వేగవంతమైన ప్రతి చర్యలకు పాల్పడతారు. వీరు తమ భావోద్వేగాలను నియంత్రించుకోవాలి, ప్రశాంతంగా ఉండాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. చిన్న చిన్న సమస్యలకు కూడా వారు అతిగా ప్రతిస్పందించి పెద్ద డ్రామా చేసేస్తారు.

These zodiac signs are Overreacting: drama queens, emotional kings!!

మిధున రాశి : అతిగా స్పందించే రాశి చక్రాలలో మిథున రాశి ఒకటి. ఈ రాశి వారికి కూడా వేగంగా మూడ్ మారుతూ ఉంటుంది. వీరు భావోద్వేగాలను అదుపు చేసుకోలేక లేరు. ఒకసారి మీరు అతిగా ఆనందాన్ని, అతిగా కోపాన్ని ప్రదర్శిస్తారు. చిన్న చిన్న సందర్భాలకు కూడా వారు తీవ్రంగా ప్రవర్తిస్తారు. అసందర్భమైన విషయాలు సులభంగా వారి కోపాన్ని ప్రేరేపిస్తాయి. ఇతరుల అభిప్రాయాలను, తెలుసుకోవడానికి ఒక క్షణం కూడా కేటాయించరు.

కర్కాటక రాశి : కర్కాటక రాశి వారు మానసికంగా చాలా సున్నితంగా ఉంటారు. మానసిక కల్లోలానికి వారు గురవుతూ ఉంటారు. చిన్న చిన్న ఆందోళనలు వారిని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఫలితంగా వారి వైఖరిలో తరచూ మార్పులు వస్తాయి. ఎప్పుడూ చిరాకు పడుతూ ఉంటారు. వీరు భావోద్వేగాలను అస్సలు కంట్రోల్ చేసుకోలేరు.

సింహరాశి : సింహరాశి జాతకులు ఎప్పుడు ఇతరుల నుంచి పొగడ్తలను, ప్రశంసలను కోరుకుంటారు. ఇతరుల శ్రద్ధ తమపై ఉండాలని ఆశిస్తారు. ఒకవేళ అందులో ఏదైనా తక్కువ జరిగితే అది వారిని తీవ్రంగా భావోద్వేగానికి గురిచేస్తుంది. వారు అనుకున్నది కాకపోతే ఆ అంశాన్ని వారు పెద్ద డ్రామా లాగా మార్చేస్తారు. అతిగా స్పందించడం సింహ రాశి వారిలో ఉన్న సహజమైన అంశం.

వృశ్చిక రాశి : వృశ్చిక రాశి వారు కూడా తీవ్రమైన భావోద్వేగ సమస్యలను కలిగి ఉంటారు. వీరు తెలివిగలవారు అయినప్పటికీ భావోద్వేగాలను అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. చిన్నపాటి అనుమానానికి కూడా వీరు లోతుగా దర్యాప్తు చేస్తారు. తమ నుండి సమాచారాన్ని దాచి పెడుతున్నారని ఎవరిపైనైనా అనుమానం కలిగితే, ఇక వారి అంతు చూడడానికి అయినా వెనుకాడరు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+