శని-కుజుడి సంయోగంతో ఈ రాశులవారికి మోయలేనన్ని కష్టాలు

జ్యోతిష్యం ప్రకారం కుంభరాశిలో కుజుడు , శని మధ్య సంయోగం జరగబోతోంది. దీనివల్ల కొన్ని రాశులవారికి కష్టాలు సంభవిస్తాయని పండితులు తెలియజేస్తున్నారు.
మార్చి 15న కుంభరాశిలో అంగారకుడు ప్రవేశిస్తాడు. 30 ఏళ్ల తర్వాత ఏర్పడే సంయోగానికి ఇదే కారణం. దీనివల్ల ఏయే రాశులవారికి కష్టాలు కలగనున్నాయి.. ఎలా నష్టపోనున్నారనే విషయాలను తెలుసుకుందాం.

వృశ్చిక రాశి
కుజుడు, శని కలయిక ఈ రాశివారికి ఎంతో హానికరం. ఆరోగ్యం బాగుండదు. ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలనుకుంటే దాన్ని వాయిదా వేయడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో మార్పులు వద్దు. తల్లిదండ్రులతో ఉండే అనుబంధాలు బలహీనపడే అవకాశం ఉంది. శనిదేవుడి సడేసతి ప్రభావం కనిపిస్తుండటంతో ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది.

these zodiac signs are unbearable hardships due to shani and mars consunction

కర్కాటక రాశి
పైకి కనిపించని వ్యాధులతో ఇబ్బంది పడతారు. కొన్ని పాత వ్యాధులు కూడా తిరగబెడతాయి. ఆర్థికంగా నష్టపోతారు. డ్రైవింగ్ చేసే సమయంలో ప్రమాదం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. శని ప్రభావంవల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. కోపంగా ఉండటంవల్ల జరిగే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. ఎవరి సలహాను మీరు స్వీకరించే పరిస్థితి ఉండదు.

మీన రాశి
మీపై కొన్ని తప్పుడు ఆరోపణలు వస్తాయి. వాటిని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. దీనివల్ల అప్పులకు లోనవుతారు. కొన్ని విషయాల్లో ఒత్తిడి ఎదుర్కొంటారు. వ్యాపారానికి సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక నష్టం సంభవిస్తుంది. ఇతరుల నుంచి తీసుకున్న డబ్బు కూడా మిస్సవుతుంది. అప్పు ఇవ్వడం అనేది మానుకోవాలి. ఆరోగ్యం క్షీణించకుండా చూసుకోవాలి. లేదంటే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+