ఈ ఏడాది చివరివరకు నక్కతోక తొక్కిన రాశులు వీరే.. మీరున్నారా?
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం, గ్రహాల సంయోగం వివిధ యోగాలను ఏర్పరుస్తాయి. కొన్ని యోగాలు శుభ యోగాలు కాగా, మరికొన్ని యోగాలు అశుభ యోగాలు. ప్రస్తుతం దేవగురువైన బృహస్పతి వృషభ రాశిలో ఉన్నాడు. ఇక గ్రహాల రాకుమారుడు అయిన బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నారు. దీంతో బుధుడు సంసప్తక దృష్టితో బృహస్పతిని చూస్తున్నాడు. ఈ రెండు గ్రహాల కారణంగా సంసప్తక యోగం ఏర్పడుతుంది.
బుధ గురు గ్రహాల సంసప్తక దృష్టి
దీని ప్రభావం ఈ ఏడాది చివరివరకు ఉంటుంది. దీంతో కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశుల వారు ఆర్ధిక ప్రయోజనాలను పొందుతారు. ఈ గురు బుధ సంసప్తక దృష్టి కారణంగా లబ్ధిని పొందే రాశుల గురించి తెలుసుకుందాం.

వృషభ రాశి
వృషభరాశి వారికి గురు బుధుల సంసప్తక దృష్టి కారణంగా శుభాలు జరుగుతాయి. వీరు అనుకున్న పనులన్నీ తప్పక పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. ఆర్ధిక ప్రయోజనాలు చేకూరుతాయి. వృత్తి, వ్యాపారాలలో కలిసి వస్తుంది. ఆర్ధికంగా ఇది మీకు తిరుగులేని సమయం. ఉద్యోగాలు చేసేవారికి కూడా ఇది శుభ సమయం.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగం చేసేవారికి గుర్తింపు లభిస్తుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి, సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. కర్కాటక రాశి జాతకులు ఈ సమయంలో నక్క తోక తొక్కినట్టే.
సింహరాశి
సింహరాశి వారికి బుధ గురు సంసప్తక దృష్టి కారణంగా రాజయోగం సిద్ధిస్తుంది. వీరు ఉద్యోగాలలో ఉన్నత స్థానానికి చేరుకుంటారు. రాజకీయ ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి.నిరుద్యోగులకు విదేశాలకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఇది సింహరాశి వారికి అదృష్టాన్ని ఇచ్చే సమయం.
వృశ్చిక రాశి
బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా వృశ్చిక రాశి వారికి సానుకూల ఫలితాలు వస్తాయి. వృశ్చిక రాశి జాతకులు ఈ సమయంలో ఉద్యోగంలో విజయాలు సాధిస్తారు. ఏ పనులు తలపెట్టినా సక్సెస్ ఫుల్ గా పూర్తి చేస్తారు. పెళ్లి కానివారికి వివాహ యోగం ఉంది. ఈ సమయంలో ఆర్ధికంగానూ ప్రయోజనాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశి జాతకులకు బుధ గురుల సంసప్తక దృష్టి కారణంగా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో మకర రాశి వారికి వర్తక, వ్యాపారాలలో ఊహించని పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వర్తక, వ్యాపారాలు చేసే వారికి కలిసిస్తుంది. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. ఆర్ధికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు.
మీనరాశి
బుధ గురుల కటాక్షం మీన రాశి వారికి శుభాలను కలిగిస్తుంది. ఈ సమయంలో మీనరాశి జాతకులు ఆకస్మిక ధన లాభాలు పొందుతారు. ఉద్యోగ వ్యాపారాలలో గణనీయమైన పురోగతి ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. అన్ని విధాలుగా ఇది మీనరాశి వారికి శుభ సమయం.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications