అరుదైన 2 యోగాలతో ఈ రాశులవారు శ్రీమంతుల స్థాయికి చేరుకుంటారు

జ్యోతిష్యం ప్రకారం వృషభం, సింహం, వృశ్చికం, కుంభ రాశులు స్థిర రాశులు. ఈ రాశుల వారు ప్రస్తుతం అత్యంత అరుదైన యోగకాలంలో ఉన్నారు. వీరు పట్టుకుందల్లా బంగారమే అవుతుంది. ఆర్థిక ప్రయత్నాలతోపాటు ఏ పని తలపెట్టినా విజయం సాధిస్తారు. అధికారంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. వీటికి కారణం ఏమిటంటే.. శని వల్ల శశ మహాపురుష యోగం, శుక్రుడి వల్ల మాలవ్య మహాపురుష యోగాలు ఏర్పడ్డాయి. ఒకరకంగా చెప్పాలంటే ఈ రాశులవారు డబుల్ జాక్‌పాట్ కొట్టినట్లే.

వృషభం
శుక్రుడు ఈ రాశిలో సంచారం చేస్తుండటంవల్ల మాలవ్య మహా పురుష యోగం, శశ మహా పురుష యోగం ఏర్పడ్డాయి. మంచి ఐశ్వర్యాన్ని పొందుతారు. రాజకీయంగా ప్రాముఖ్యత పెరుగుతుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు అవుతాయి. జానకర్షణ పెరుగుతుంది. సాధారణ స్థాయి నుంచి శ్రీమంతుల స్థాయికి చేరుకుంటారు.

these zodiac signs are very lucky due to sasa and malavya yogas 2024 june

సింహం
ఉద్యోగంలో ఉన్నవారికి అధికార యోగం పడుతుంది. ఆదాయం పెరిగి వృద్ధిలోకి వస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం దొరుకుతుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నించేవారి కోరిక నెరవేరుతుంది. పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో ఘనవిజయం సాధిస్తారు. రాజకీయాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు. జీవితంలో గతంలో ఎన్నడూ చోటుచేసుకోనంత రీతిలో శుభ పరిణామాలు చోటుచేసుకుంటాయి.

వృశ్చికం
శశ, మాలవ్య యోగాలవల్ల వీరికి వాహన యోగంతోపాటు గృహ యోగం ఉంది. స్థిరాస్తులు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో ప్రాధాన్యత పెరగడంతో స్థిరత్వం వస్తుంది. నిరుద్యోగులకు, ఉద్యోగులకు విదేశీ ప్రయాణానికి సంబంధించిన ఆఫర్లు అందుతాయి. సామాజికంగా గుర్తింపు లభిస్తుంది. ధనాదాయం పెరగడంతోపాటు ప్రముఖులతో పరిచయాలు విస్తరిస్తాయి. సంపన్నుల కుటుంబంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ప్రేమ వ్యవహారాల్లో కూడా అదృష్టం తోడుంటుంది.

ఉన్నతస్థాయిలో ఉన్న వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. సర్వత్రా ప్రాధాన్యం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి స్థాయిని అందుకుంటారు. వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. కుటుంబంలో సంతోషం వెల్లివిరుస్తుంది. తీర్థయాత్రలకు లేదంటే విహారయాత్రలకు వెళతారు. సమాజంలో హోదా పెరుగుతుంది. ధనవంతులవుతారు. ఆకస్మిక ధనలాభం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+