267 రోజులపాటు ఈ రాశులవారు పట్టుకుందల్లా బంగారమే

శని దేవుడు కర్మలను బట్టి ఫలాలను ఇస్తాడు. వ్యక్తి జాతకంలో శని దేవుడు శుభస్థానంలో ఉంటే ఎంత పేదరికంలో ఉన్నవారైనా ధనవంతులవుతారు. అశుభ స్థానంలో ఉంటే సమస్యలు ఎదురవుతాయి. కుంభరాశిలో సంచరిస్తున్న శని వచ్చే ఏడాది ఫిబ్రవరి 28న మరో రాశిలోకి సంచరిస్తుంది. దీనివల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొన్ని రాశులకు విపరీతంగా కలిసివస్తుంది. జ్యోతిష్యం ప్రకారం 267 రోజులు కొన్ని రాశులవారికి ధనలాభం ఉంది. ఏవిధంగా, ఎలా కలిసిరానుందనే విషయాన్ని తెలుసుకుందాం.

మేష రాశి
ఈ సమయంలో ఈ రాశివారికి విపరీతమైన ధనలాభాలున్నాయి. తోటి ఉద్యోగుల మద్దతుతో అనేక ప్రయోజనాలు పొందుతారు. పదోన్నతి ఉంది. తద్వారా వేతనం పెరిగి ఆర్థికంగా లాభం కలుగుతుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అలా తీసుకోకపోతే దీర్ఘకాలిక వ్యాధులబారిన పడే ప్రమాదం కనపడుతోంది. జీవిత భాగస్వామికి విలువనివ్వడంతో సలహాలు, సూచనలు స్వీకరించడంవల్ల మంచి లాభాలు కలుగుతాయి.

these zodiac signs are very lucky due to Saturn transit 2024 to 2025

తులా రాశి
ఉద్యోగస్తులకు భారీగా వేతనాలు పెరుగుతాయి. కుటుంబంలో శాంతి, సౌఖ్యం కలుగుతాయి. స్నేహితుల సహాయంతో జీవితంలో వస్తున్న కష్టాలన్నీ తొలగిపోతాయి. ఆనందం పెరుగుతుంది. విద్యార్థులకు బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధపడేవారు అన్నిరకాలుగా కష్టపడాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడిపేందుకు ఇష్టపడతారు. కొద్దికాలం నుంచి పని పూర్తవకుండా పెండింగ్ లో ఉన్నవన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి.

సింహ రాశి
శని సంచారం ఈ రాశివారికి బాగా కలిసి వస్తుంది. ఏళ్ల తరబడి పూర్తికాకుండా నిలిచిపోయిన పనులు కూడా సులభంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలున్నాయి. కెరీర్ కు సంబంధించి జీవితంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. వ్యక్తిగత జీవితంలో శాంతి నెలకొంటుంది. ప్రేమ జీవితంలో కూడా మార్పులు వస్తాయి. విద్యార్థులు విదేశాల్లో చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+