విశ్వావసు నామ ఉగాది నుండి ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టి కుబేరులయ్యేది వీరే!
విశ్వావసు నామ సంవత్సరంలో గ్రహాల సంచారం కారణంగా ఉగాది నుండి అదృష్టం పట్టబోతున్న రాశులు ఏవి అని తెలుసుకోవాలని చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు. అయితే విశ్వావసు నామ సంవత్సరంలో శని సంచారం కారణంగా కొన్ని రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుందని చాలామంది ప్రముఖ జ్యోతిష్యులు చెబుతున్నారు. ద్వాదశ రాశులలో మూడు రాశుల వారికి శని సంచారం కారణంగా అదృష్టం పట్టబోతుంది.
ఉగాది నుండి వీరికి శుభాలను చేకూర్చే శని
జన్మరాశి నుంచి లెక్కపెట్టి వచ్చే 3,6, 11 రాశులలో శని భగవానుడు ఉంటే శని భగవానుడు ఆ మూడు రాశులకు సకల శుభాలను చేకూరుస్తాడని చెబుతారు. ఇక ఈ సంవత్సరం ముఖ్యంగా మూడు రాశుల వారికి సంవత్సరం అంతా తిరుగులేని జాతకాన్ని శని భగవానుడు ప్రసాదించాడు ఆ రాశుల విషయానికి వస్తే..

వృషభ రాశి
శని సంచారంలో మార్పు కారణంగా వృషభ రాశి జాతకులకు విశేషమైన రాజయోగం పట్టబోతుంది. వృషభ రాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు జరిగి మీన రాశి 11 వ రాశి అవుతుంది. ఇక వృషభ రాశిలో 11వ స్థానంలో శని సంచారం చేయడం వల్ల వీరి కష్టానికి తగిన ఫలితం ఉంటుంది. వృత్తిపరంగానూ పురోభివృద్ధి ఉంటుంది. విశేషమైన ధన లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులు సంతోషంగా జీవిస్తారు.
తులారాశి
ఉగాది నుండి తులా రాశి వారికి శని సంచారం కారణంగా రాజయోగం పట్టబోతుంది. తులారాశి నుంచి లెక్కపెట్టినప్పుడు శని సంచారంలో మార్పు ఆరవ రాశి అయిన మీనరాశిలో జరుగుతుంది. కాబట్టి శని తులారాశిలో ఆరవ స్థానంలో సంచరిస్తాడు. ఇది తులా రాశి వారికి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అప్పుల ఊబి నుంచి బయటపడేలా చేస్తుంది. శత్రు బాధలు, దృష్టిలోపాలు తొలగిపోతాయి. ఈ సమయంలో వీరు అనుకున్న పనులన్నీ సావధానంగా పూర్తి అవుతాయి. ఇప్పుడు ఏం చేసినా అదృష్ట లక్ష్మి వరిస్తుంది.
మకర రాశి
ఉగాది నుండి మకర రాశి వారికి అదృష్టం కలిసి రాబోతుంది. మకర రాశి జాతకులు ఈ సమయంలో సానుకూల ఫలితాలను పొందుతారు. ఉగాది నుండి శని భగవానుడు మకర రాశిలో తృతీయంలో సంచారం చేయడం వల్ల ఇది విశేషమైన యోగాన్ని కలిగిస్తుందని చెబుతారు. మూడవ స్థానంలో శని బలంగా ఉండడం వల్ల కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుందని, సోదరులతో ఉన్న సమస్యలు తొలగిపోయి, ఆస్తుల విషయంలో లాభాలు చేకూరుతాయని చెబుతారు. ఇక అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడం వల్ల మకర రాశి వారు ఈ సమయంలో విశేషమైన ప్రయోజనాలను పొందుతున్నారు.
disclaimer: ఈ కథనం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది. oneindia దీనిని ధృవీకరించలేదు.












Click it and Unblock the Notifications