త్వరలో మాలవ్య రాజయోగంతో ఈ రాశులవారు మట్టి ముట్టుకున్నా బంగారమే!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంయోగం కారణంగా వివిధ యోగాలు ఏర్పడతాయి. ఇక అటువంటి అత్యంత శక్తివంతమైన పంచ మహాపురుష యోగాలలో ఒకటైన మాలవ్య రాజయోగం 2025వ సంవత్సరంలో ఏర్పడనుంది. విలాసాలకు అధిపతి అయిన శుక్రుడు 2025 జూన్లో తన సొంత రాశి అయిన వృషభ రాశిలో సంచారం చేస్తాడు.
మాలవ్య రాజయోగం
శుక్రుడు వృషభ రాశిలో సంచారం చేసే వేళ మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇక మాలవ్య రాజయోగం కారణంగా ద్వాదశ రాశుల వారి జీవితం పైన ప్రభావం పడుతుంది. వారికి ఆర్ధికంగా అన్ని విధాలా కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం.

వృషభ రాశి
మాలవ్య రాజయోగం తో వృషభ రాశి జాతకులు అదృష్టవంతులుగా మారుతున్నారు. వృషభ రాశిలో శుక్రుడి మాలవ్య యోగం లగ్న గృహంలో జరుగుతుంది. దీనివల్ల వృషభ రాశి స్థానికుల వ్యక్తిత్వం మెరుగు పడుతుంది. పెద్దవాళ్లతో సంబంధాలు భవిష్యత్తులో ప్రయోజనాలను చేకూరుస్తాయి. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. బంధువుల మద్దతు లభిస్తుంది. వృషభ రాశి స్థానికుల ఆరోగ్యం బాగుపడుతుంది. ఈ సమయంలో ఆర్థికంగాను పురోగతి ఉంటుంది.
కర్కాటక రాశి
మాలవ్య రాజయోగంతో కర్కాటక రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి . కర్కాటక రాశిలో 11వ ఇంట్లో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు ఏ పని చేసిన మంచి ప్రతిఫలం ఉంటుంది. వీరి ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. వర్తక వ్యాపారాలు చేసేవారు వివిధ ఒప్పందాల నుండి భారీగా డబ్బులు సంపాదిస్తారు.
కర్కాటక రాశి వారికి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు
కర్కాటక రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు తగిన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు వస్తాయి. ఈ సమయంలో కర్కాటక రాశి జాతకులు విలాసాలతో జీవిస్తారు.
సింహరాశి
సింహ రాశి వారికి మాలవ్య రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. శుక్రుడు సింహరాశిలో కర్మ గృహంలో సంచరించడం వల్ల వర్తక వ్యాపారాలలో పురోగతి ఉంటుంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి మంచి లాభాలు వస్తాయి. వివాహితులకు మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు, ఇంక్రిమెంట్లు వస్తాయి. వారికి సమాజంలో గౌరవం పెరుగుతుంది. సింహరాశి జాతకులు పనులను పూర్తి చేస్తారు. సింహ రాశి వారు వివిధ కార్యకలాపాలలో పాల్గొనడంలో ఉత్సాహంగా ఉంటారు. ఈ సమయంలో వీరు ఏది చేసినా కలిసి వస్తుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications