దసరా తర్వాత సంసప్తక యోగంతో ఈ రాశులవారికి కుబేర యోగం!
వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు సంచారం గ్రహాలు సంయోగం అన్ని రాశుల వారిపైన ప్రభావాన్ని చూపిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి, శుక్ర గ్రహాలకు చాలా ముఖ్యమైన స్థానం ఉంటుంది. ప్రస్తుతం బృహస్పతి వృషభ రాశిలో సంచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే సమయంలో శుక్రుడు అక్టోబర్ 13వ తేదీన వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దసరా పండుగ తర్వాత సంసప్తక యోగం ఏర్పడుతుంది.
సంసప్తక రాజయోగం.. మూడు రాశులవారిది అదృష్టం
బృహస్పతి శుక్రుడు ఒకదానికొకటి ఏడు ఇళ్ల దూరంలో ఉన్నప్పుడు సంసప్తక రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.సంసప్తక యోగం.. గురు శుక్ర గ్రహాల అరుదైన కలయిక కారణంగా ఏర్పడే యోగంతో ముఖ్యంగా మూడు రాశుల వారికి అదృష్టం మారబోతుంది. ఈ మూడు రాశుల వారు పట్టిందల్లా ఈ సమయంలో బంగారమే అవుతుంది.

వృషభ రాశి
వృషభ రాశి సంసప్తక రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు అదృష్ట జాతకులు గా మారుతున్నారు. ఈ సమయంలో వృషభ రాశి వారు శుభవార్తలు వింటారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కోరుకున్న కోరికలు నెరవేరుతాయి.
ధనుస్సు రాశి
సంసప్తక రాజయోగం కారణంగా ధనుస్సు రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. ధనుస్సు రాశి జాతకులు ఈ సమయంలో ఆర్థికంగా లబ్ధిని పొందుతారు. వీరికి ఊహించని ధన లాభం కలుగుతుంది. పెండింగ్లో ఉన్న డబ్బులు చేతికి అందుతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లబ్ధి జరుగుతుంది. అన్ని విధాలా ఇది అదృష్ట కాలం.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి జాతకులకు సంసప్తక యోగం బాగా కలిసొస్తుంది. ఈ సమయంలో వృశ్చిక రాశి జాతకులు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఇది వీరికి నిజంగా అదృష్ట కాలం. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి .వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది మంచి కాలం. ఈ సమయంలో ఆరోగ్యం కూడా బాగుంటుంది.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications