నేటినుండి గజకేసరి రాజయోగంతో ఏనుగు కుంభస్థలం బద్దలు కొట్టే రాశులివే!
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల కలయిక ద్వాదశ రాశుల వారి జీవితాలలో ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహాలలో గురువు మరియు చంద్రుడు అత్యంత శక్తివంతమైన గ్రహాలుగా చెబుతారు. ఈ రెండు గ్రహాల కలయిక గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. నేడు జూన్ 24వ తేదీన చంద్రుడు మిధున రాశిలో ప్రవేశిస్తాడు.
గజకేసరి రాజయోగం
అప్పటికే మిధున రాశిలో బృహస్పతి ఉండటం వల్ల గజకేసరి రాజయోగం ఏర్పడుతోంది. ఈ రాజయోగం కొన్ని రాశులవారిని కోటీశ్వరులను చేస్తుంది. ఏనుగు కుంభ స్థలం బద్దలు కొట్టేలా సంపదలను ఇస్తుంది. గజకేసరి రాజయోగం కారణంగా కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. మరి ఆ రాశులు ఏమిటో ప్రస్తుతం మనం తెలుసుకుందాం.

వృషభ రాశి
గజకేసరి రాజయోగం కారణంగా వృషభ రాశి జాతకులు ఆత్మవిశ్వాసంతో అన్ని పనులు పూర్తి చేస్తారు. ఈ సమయంలో విజయాలు సాధిస్తారు. వివాహం కాని వారికి వివాహాలు అయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న గొడవలు తగ్గి కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. కెరీర్ కి సంబంధించి ప్రాజెక్టులు పూర్తి చేస్తారు.
మిధున రాశి
గజకేసరి రాజయోగం కారణంగా మిధున రాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో ఏ పని చేసిన విజయం వరిస్తుంది. నేటి నుంచి వీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. విద్యార్థులకు కలిసి వస్తుంది. ఈ రాశుల వారు తమ జీవితంలో ఉన్నత స్థానాన్ని అందుకోవడానికి అనుకూలమైన సమయం. గజకేసరి రాజయోగం తో మిధున రాశి వారు సంతోషంగా జీవిస్తారు.
తులారాశి
తులా రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని ఇస్తుంది. ఈ రాశి వారి ప్రేమ జీవితం సంతోష దాయకంగా సాగుతుంది. గజకేసరి రాజయోగం కారణంగా పెండింగ్లో ఉన్న కోర్టు కేసులు పరిష్కారమవుతాయి. తల్లి ఆరోగ్యం పైన ఇంత కాలం గా ఉన్న ఆందోళన తగ్గుతుంది. గజకేసరి రాజయోగం తో ఏ సమస్య అయినా పరిష్కరించే శక్తిని ఈ సమయంలో కలిగి ఉంటారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేసి సంపూర్ణ విజయాన్ని సాధిస్తారు.












Click it and Unblock the Notifications