జనవరి 20వరకు వీరికి సంపన్న యోగం.. శాసించిన తిరోగమన కుజుడు!

వేద జ్యోతిష శాస్త్రంలో గ్రహాల సంచారం కారణంగా జ్యోతిష్య మార్పులు ఏర్పడతాయి. నిర్దిష్ట సమయంలో గ్రహాలు సంచారం చేస్తూ ఉంటాయి. ఇక గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అనేక రాశుల వారికి లబ్ధిని చేకూరుస్తాయి. 2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల సంచారం ఊహించని మార్పులకు కారణం అవుతుంది.

కర్కాటక రాశిలో కుజ సంచారం
2025 సంవత్సరంలో ముఖ్య గ్రహాల రవాణా అన్ని రాశుల వారికి సానుకూల మరియు ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ప్రస్తుతం 2025 సంవత్సరంలో కుజుడు తిరోగమన సంచారం చేస్తున్నాడు. 9 గ్రహాలలో విశ్వాసానికి అధిపతి అయిన కుజుడు ఒక రాశి నుండి మరొక రాశికి మారడానికి 45 రోజుల సమయం పడుతుంది. ప్రస్తుతం కుజుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు.

These zodiac signs will be blessed with wealth till January 20th ruled by retrograde Mars

కుజ తిరోగమన సంచారంతో లాభపడే రాశులు
కర్కాటక రాశిలోకి కుజుడు తిరోగమనములో జనవరి 20 వరకు సంచారం చేస్తాడు. కర్కాటకంలో కుజుడు తిరోగమన సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. వారికి ఊహించని ఆర్ధిక లాభాలు కలుగుతాయి. ఈ సమయంలో వీరు సంతోషంగా జీవిస్తారు. కుజుడు తిరోగమన సంచారం కారణంగా లబ్ధిని పొందే రాశులు ఏమిటో ప్రస్తుతం తెలుసుకుందాం.

మేష రాశి
కుజుడు తిరోగమన సంచారం కారణంగా మేష రాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. మేష రాశి వారికి ఈ సమయంలో కొత్త అవకాశాలు కనిపిస్తాయి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. ఇది మేషరాశి వారికి శుభ సమయం. వర్తక, వ్యాపారాలు చేసే వారికి లాభాలు వస్తాయి.

సింహరాశి
కుజుడి తిరోగమన సంచారం కారణంగా సింహరాశి జాతకులకు సానుకూల ఫలితాలు వస్తాయి. సింహ రాశి వారు వ్యాపారాలు చేస్తే వారికి లాభాలు వస్తాయి. కొత్త పెట్టుబడులు కూడా ఆశించిన ప్రయోజనాలను చేకూరుస్తాయి. అనుకున్న పనులన్నీ విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇది సింహరాశి వారికి అదృష్ట కాలం.

ధనుస్సు రాశి
కుజుడి తిరోగమన సంచారం ధనుస్సు రాశి వారికి భావోద్వేగ బంధాన్ని కలిగిస్తుంది. బంధువులతోను, కుటుంబ సభ్యులతోనూ ఉన్న మనస్పర్ధలు దూరమవుతాయి, సమస్యలు పరిష్కారం అవుతాయి, జీవిత భాగస్వామి నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తుంది. ఈ సమయంలో ధనుస్సు రాశి జాతకులు సంతోషంగా జీవిస్తారు.

disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+