2025లో ఈ రాశులవారే మహర్జాతకులు.. నా మాటే వేదం అన్న బాబా వంగా!
2025 సంవత్సరం వస్తుంది. 2025లో తమ జాతకం ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలని ఆత్రుత జ్యోతిష్యశాస్త్రాన్ని నమ్మే ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. 2025సంవత్సరంలో గ్రహాల గమనం కారణంగా ద్వాదశ రాశుల వారి జాతకాలు మారుతాయి అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే 2025సంవత్సరంలో ఏ రాశుల వారి అదృష్టం బాగుంటుంది అనే విషయాన్ని ప్రపంచంలోని ప్రసిద్ధ జ్యోతిష్య నిపుణులు అయిన బాబా వంగా తన అంచనాలలో వెల్లడించారు.
2025 అదృష్టరాశులు... బాబా వంగా ప్రిడిక్షన్
బాబా వంగా తన జ్ఞాన దృష్టితో భవిష్యత్తులో జరిగే సంఘటనలను గొప్ప అంచనాలు వేసి ముందుగానే చెప్పారు. 1966 లో బాబా వంగా మరణించినప్పటికీ ఆమె చెప్పిన జ్యోతిష్య శాస్త్ర అంచనాలు నేటికి చాలామంది బలంగా నమ్ముతారు. అవి నిజమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలో 2025లో ఏ రాశి వారు ఆర్థిక విజయాలను సాధిస్తారో బాబా వంగా ముందుగానే చెప్పారు.

మేషరాశి
మేషరాశి వారికి 2025 సంవత్సరం గొప్ప విజయాలను అందిస్తుందని బాబా వంగా తెలిపారు. ఈ సమయంలో మేషరాశి వారికి కష్టానికి తగిన ఫలితం వస్తుందని, డబ్బు సంపాదించడానికి చాలా గొప్ప అవకాశాలు వస్తాయని, మేష రాశి వారి అదృష్టం ప్రకాశిస్తుందని పేర్కొన్నారు. మేషరాశి జాతకులు ఈ సమయంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారని తెలిపారు. 2025సంవత్సరం మేష రాశి వారికి సంపదను, పురోగతిని ఇస్తుందని బాబా వంగా తన ప్రిడిక్షన్లో పేర్కొన్నారు.
వృషభ రాశి
వృషభ రాశి వారు 2025లో తమ కష్టానికి తగిన ఫలితాలు పొందుతారని, ఆర్థికంగా ఈ సమయాల్లో బలోపేతం అవుతారని బాబా వంగా జ్యోతిష్య అంచనా. వర్తక, వ్యాపారాలు చేసే వారికి, ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయంలో విజయాలు వరిస్తాయని బాబా వంగా తెలిపారు..
కర్కాటక రాశి
2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి అద్భుతమైన పురోగతిని ఇస్తుందని బాబా వంగ పేర్కొన్నారు. కర్కాటక రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడం వల్ల ఈ సమయంలో సానుకూల ఫలితాలు వస్తాయని, కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది సరైన సమయం అన్నారు. ఇప్పటికే ఉన్న వ్యాపారాలను విస్తరించడానికి కూడా అద్భుతమైన సమయం ఇది అని పేర్కొన్నారు. ఆర్థికంగా ఈ సమయంలో బలపడతారని తెలిపారు.
మిధున రాశి
2025 సంవత్సరంలో మిధున రాశి వారు సానుకూల ఫలితాలను చూస్తారని బాబా వంగా పేర్కొన్నారు. ఈ సమయంలో మిధున రాశి వారి ఆర్థిక పరిస్థితి బాగా మారుతుందని, గ్రహాల సానుకూల స్థానం కారణంగా డబ్బులు సంపాదించడానికి కొత్త మార్గాలు కనిపిస్తాయని వెల్లడించారు. ఇది మిధున రాశి వారికి అదృష్ట సంవత్సరంగా తెలిపారు.
కుంభరాశి
2025 లో కుంభ రాశి వారు జీవితంలో ఉన్నత శిఖరాలను చేరుకుంటారని, శని దయ కారణంగా ఆత్మవిశ్వాసం, ధైర్యం ఈ సమయంలో బాగా పెరుగుతాయని తెలిపారు. అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొని విజయం సాధించగలుగుతారని, ఈ సంవత్సరం ఆర్థికపరమైన, వృత్తిపరమైన రంగాలలో గొప్ప ప్రయోజనాలను పొందుతారని పేర్కొన్నారు.
disclaimer: ఈ కథనం వాస్తు, జ్యోతిష్య నిపుణుల సలహాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రూపొందించబడినది. దీనిని oneindia ధ్రువీకరించలేదు.












Click it and Unblock the Notifications